సీఎం చంద్రబాబు దీక్ష పేరు 'ధర్మపోరాట దీక్ష'

మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (17:18 IST)

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధర్మపోరాటం చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన ఈనెల 20వ తేదీన పుట్టినరోజు సందర్భంగా ఆయన నిరాహారదీక్షకు దిగనున్నట్టు ప్రకటించారు.
chandrababu naidu
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయంపై నిరసన తెలపడానికి తన పుట్టిన సందర్భంగా నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న ఈ దీక్షకు 'ధర్మపోరాట దీక్ష' అనే పేరు పెట్టారు. 
 
'నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం' అనే నినాదాన్ని ఈ వేదిక ద్వారా వినిపించనున్నారు. ఈ నిరశన ఉదయం 7 నుంచి (తొలుత ఉదయం 9 గంటల నుంచి చేయాలనుకున్నారు) రాత్రి 7 వరకు చేయాలని నిర్ణయించారు. ఆ రోజు పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మరింత చదవండి :  
చంద్రబాబు నాయుడు దీక్ష బర్త్‌డే బీజేపీ ప్రభుత్వం Birthday Chandrababu Naidu Bjp Govt Observe Fast

Loading comments ...

తెలుగు వార్తలు

news

శ్రీరెడ్డిపై జనసేన కార్యకర్తలు ఫైర్.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. ఆ సింగర్లు ఏమన్నారంటే?

జనసేన పార్టీ అధినేత, అగ్రహీరో పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి చేసిన ...

news

కేసీఆర్ సర్కారుకు షాక్ ... ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ...

news

జూన్ 2 నుంచి ఏపీలో అన్న క్యాంటీన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ రెండో తేదీ నుంచ అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. ...

news

మసాజ్ పేరిట వ్యభిచారం... ముగ్గురమ్మాయిలు.. ఇద్దరు విటులు

హైదరాబాద్‌లోని నాచారంలో మసాజ్ పేరిట వ్యభిచారం సాగుతూ వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ...