Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కేసీఆర్ సర్కారుకు షాక్ ... ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత

మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (15:58 IST)

Widgets Magazine
Komatireddy Venkat Reddy

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేసింది. కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌‌లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విధించిన సభ్యత్వాల రద్దును హైకోర్టు ఎత్తేసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాలు కొనసాగుతాయని తీర్పు వెల్లడించింది.
 
వారి సభ్యత్వం ఎప్పటి వరకు ఉందో... అప్పటి వరకు పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌‌పై దాడికి సంబంధించి క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలనుకుంటే ఈ తీర్పు అడ్డంకి కాబోదని తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
 
కాగా, అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా దాడికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ల శాసన సభ్యత్వాలను స్పీకర్ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా కోర్టు తీర్పును వెలువరించింది . Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జూన్ 2 నుంచి ఏపీలో అన్న క్యాంటీన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ రెండో తేదీ నుంచ అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. ...

news

మసాజ్ పేరిట వ్యభిచారం... ముగ్గురమ్మాయిలు.. ఇద్దరు విటులు

హైదరాబాద్‌లోని నాచారంలో మసాజ్ పేరిట వ్యభిచారం సాగుతూ వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ...

news

బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ హరిబాబు ఎందుకు రిజైన్ చేశారంటే...

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా విశాఖపట్టణం ఎంపీ కంభంపాటి హరిబాబు ఉన్నారు. ...

news

మనుషుల గుండెల్ని కాల్చుకుతినే కిరాతకుడు, నరరూప రాక్షసుడు జంగిల్ జబ్బా అరెస్ట్

మానవ గుండెలను కాల్చుకు తినే నరరూప రాక్షసుడు జంగిల్ జబ్బా‌ అరెస్టయ్యాడు. మనుష్యులను ...

Widgets Magazine