శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 17 మే 2018 (11:05 IST)

ప్రజాస్వామ్యం ఖూనీ కావడాన్ని చూసి భారతావని మౌనం పాటిస్తోంది : రాహుల్ ట్వీట్

ప్రపంచంలోనే అత్యంత గొప్పదిగా భావించే భారత ప్రజాస్వామ్యం ఖూనీ కావడాన్ని యావత్ భారతావని మౌనం పాటిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

ప్రపంచంలోనే అత్యంత గొప్పదిగా భావించే భారత ప్రజాస్వామ్యం ఖూనీ కావడాన్ని యావత్ భారతావని మౌనం పాటిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
 
గురువారం ఉదయం కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడాన్ని తప్పుబడుతూ తన ట్విట్టర్ ఖాతాలో విమర్శలు గుప్పించారు. మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలం లేనప్పటికీ, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ఇది బీజేపీ అహేతుకమైన పట్టుదలంటూ వ్యాఖ్యానించారు. 
 
నిజానికి గురువారం ఉదయం బీజేపీ విజయోత్సవాలను జరుపుకుంటూ ఉంటే, భారతావని ప్రజాస్వామ్యం ఖూనీ కావడాన్ని చూసి మౌనం పాటిస్తోందని అన్నారు. భారత రాజ్యాంగాన్నీ బీజేపీ అపహాస్యం చేసిందని నిప్పులు చెరిగారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠాన్ని ప్రజలే చెబుతారంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.