Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జయా బచ్చన్ ఆస్తుల విలువ రూ.1000 కోట్లు... వాచ్‌ల విలువ రూ.3.4 కోట్లు!

మంగళవారం, 13 మార్చి 2018 (11:53 IST)

Widgets Magazine
Jaya Bachchan

బాలీవుడ్ 'బిగ్ బి' అమితాబ్ సతీమణి జయా బచ్చన్. ఈమె రాజ్యసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో ఒకసారి పెద్దల సభకు ప్రాతినిథ్యం వహించిన ఆమె.. ఇపుడు మరోమారు పోటీలో నిలిచారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నుంచి బరిలోకి దిగుతున్న ఆమె... తాజాగా తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఇందులో ఆమె ఆస్తుల వివరాలను పొందుపరిచారు.
 
ఈ నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నట్టుగా జయా బచ్చన్ ఆస్తుల విలువ రూ.1000 కోట్లు. ఆమె రాజ్యసభకు ఎంపికైతే అత్యంత ధనిక ఎంపీగా నిలవనున్నారు. కాగా, ఎస్పీ నుంచి రాజ్యసభ ఎంపీ రేసులో ఉన్న జయ 2012లో పోటీచేసినప్పుడు ఆమె ఆస్తుల విలువ రూ.493 కోట్లున్నట్లు గతంలో వెల్లడించారు. 2012లో కలిగి ఉన్న వారి ఆస్తుల విలువ ప్రస్తుతం రెండు రెట్లు పెరిగాయి.
 
అమితాబ్, జయ దగ్గరున్న చేతి గడియారాల విలువ వరుసగా రూ.3.4 కోట్లు, రూ.51లక్షలున్నట్లు పేర్కొన్నారు. రూ.9 లక్షల విలువగల పెన్నులు ఉన్నట్టు  వెల్లడించారు. అలాగే, ఫ్రాన్స్‌లోని బ్రిజ్‌నొగాన్ ప్లేజ్‌లో బచన్ కుటుంబానికి 3,175 చదరపుటడుగుల నివాసిత ఆస్తులు ఉన్నట్లు వివరించారు. అంతేగాక దేశంలోని ప్రముఖ నగరాలు నోయిడా, భోపాల్, పుణె, అహ్మదాబాద్, గాంధీనగర్‌లో ఆస్తులు ఉన్నట్టు ఆమె తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 
 
ఈ ఎన్నికల్లో ఆమె గెలుపొంది రాజ్యసభలో అడుగుపెడితే అతిపెద్ద ధనవంతురాలైన సభ్యురాలిగా రికార్డు సృష్టించనున్నారు. ప్రస్తుతం 2014లో బీజేపీ తరపున రాజ్యసభకు ఎంపికైన రవీంద్ర కిశోర్ సిన్హా రూ.800 కోట్ల ఆస్తితో ప్రస్తుతం అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నిత్యం శీలాన్ని శంకిస్తూ సూటిపోటి మాటలు.. తనువు చాలించిన విప్రో ఉద్యోగిని.. ఎక్కడ?

కట్టుకున్న భర్త నిత్యం శీలాన్నిశంకిస్తూ సూటిపోటి మాటలతో మానసికక్షోభకు గురిచేస్తుంటడంతో ...

news

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - సంపత్‌ల శాసనసభ సభ్యత్వం రద్దు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర ...

news

నీచ కులానికి చెందిన మోడీ దేశాన్ని పాలిస్తున్నారు.. నోరు జారిన వీర్రాజు

భారతీయ జనతా పార్టీకి చెందిన ఏపీకి చెందిన శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు నోరుజారారు. అదీ ...

news

సునంద్ పుష్కర్‌కు విషమిచ్చి చంపేశారా? డీఎన్ఏ రిపోర్టు ఏం చెపుతోంది?

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ భార్య సునంద ...

Widgets Magazine