శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 16 మే 2018 (12:56 IST)

బీజేపీకి షాకిచ్చిన రేవణ్ణ.. కర్ణాటక సీఎం కుమారస్వామినే...

తనపై గంపెడాశలు పెట్టుకున్న కమలనాథులకు మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు రేవణ్ణ తేరుకోలేని షాకిచ్చారు. తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వదంతులను ఆయన కొట్టిపారేశారు. అంతేనా, జేడీఎస్ - కాంగ్రెస్ కలిసి ప్రభుత్వ

తనపై గంపెడాశలు పెట్టుకున్న కమలనాథులకు మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు రేవణ్ణ తేరుకోలేని షాకిచ్చారు. తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వదంతులను ఆయన కొట్టిపారేశారు. అంతేనా, జేడీఎస్ - కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని, ముఖ్యమంత్రిగా కుమార స్వామి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన స్పష్టంచేశారు.
 
బుధవారం ఉదయం జేడీఎస్ శాసనసభాపక్షనేతగా కుమారస్వామిని ఎన్నుకున్న తర్వాత సోదరుడితో కలిసి రేవణ్ణ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జేడీఎస్ నుంచి చీలతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఈ వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. జేడీఎస్ - కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని చెప్పారు. జేడీఎస్ ఎల్పీ నేతగా ఎన్నికైన కుమారస్వామిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
 
కాగా, మంగళవారం వెల్లడైన కన్నడ ఎన్నిక ఫలితాల్లో బీజేపీ 104 స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. అయితే, 78 సీట్లు పొందిన కాంగ్రెస్ 38 సీట్లు సాధించిన జేడీఎస్‌కు మద్దతు ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు చొరవ చూపింది. ఈ హఠాత్ పరిణామాన్ని కమలనాథులు జీర్ణిచుకోలేక పోయారు. 
 
దీంతో జేడీఎస్ చీలిక తెచ్చి.. రేవణ్ణను తమవైపుకు తిప్పుకునేందుకు కమలనాథులు వ్యూహరచనలు చేశారు. ముఖ్యంగా, రేవణ్ణకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆయన వర్గానికి చెందిన 12 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తామంటూ ఆఫర్ చేసింది. దీంతో రేవణ్ణ బీజేపీలోకి వెళుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారానికి ఆయన తెరదించారు.