Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కింగ్ మేకర్ కాదట.. కర్ణాటక కింగేనట ... తండ్రి బాటలో తనయుడు...

బుధవారం, 16 మే 2018 (10:17 IST)

Widgets Magazine

మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు కుమార స్వామి. ఈయన ఇపుడు కర్ణాటక రాజకీయాల్లో 'కింగ్ మేకర్'. జనతాదళ్ సెక్యులర్ పేరుతో పార్టీ నడుపుతున్న కుమార స్వామి ఇపుడు... ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నారు. అంతేనా.. తండ్రి బాటలోనే తనయుడు కూడా పయనిస్తూ అందరి మన్నలూ పొందుతున్నారు.
HD Kumaraswamy
 
1996వ సంవత్సరంలో పార్లమెంటులో కేవలం 16 మంది సభ్యుల బలమున్న జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడ అనూహ్యంగా ప్రధానమంత్రి సీట్లో కూర్చొన్నారు. అలాగే 22 ఏళ్ల తర్వాత కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో 15 శాతం సీట్లు సాధించిన దేవెగౌడ తనయుడు, జేడీ(ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి కర్ణాటక 23వ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. 
 
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బయట నుంచి జేడీ(ఎస్)కు మద్దతు ఇస్తున్నందువల్ల 38 మంది జేడీ(ఎస్) ఎమ్మెల్యేల్లో 33 మందికి మంత్రి పదవులు వరించే అవకాశాలున్నాయి. జేడీ(ఎస్) రెండు దశాబ్దాలుగా కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్ పాత్ర పోషిస్తూ ఆ పార్టీ మనుగడ సాధిస్తోంది. 2008వ సంవత్సరంలో కర్ణాటకలో అధికారం కోల్పోయిన జేడీ(ఎస్) పదేళ్లు ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఇపుడు అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు గవర్నర్ పిలుపు కోసం వేచిచూస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రంజుగామారిన కర్ణాటక రాజకీయం.. గవర్నర్‌ కోర్టులో బంతి

కర్ణాటక రాజకీయం రంజుగా మారింది. ప్రభుత్వ ఏర్పాటు బంతి ఇపుడు గవర్నర్ కోర్టులో పడింది. ...

news

దటీజ్.. ప్రియాంకా గాంధీ... చిన్నపాటి సలహాతో బీజేపీ ఆశలు గల్లంతు

కర్ణాటక ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ కుమార్తె ...

news

ఆ మూడు రాష్ట్రాల్లో ఏం జరిగింది?... బీజేపీ ఫార్ములతో కాంగ్రెస్ పక్కా ప్లాన్

గతంలో భారతీయ జనతా పార్టీ అడ్డదారులు తొక్కి మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు ...

news

కర్ణాటక ఎన్నికల్లో తెలుగు 'పంచ్' ... గింగరాలు తిరిగిన బీజేపీ అభ్యర్థులు...

కర్ణాటక ఎన్నికల్లో తెలుగోడి పంచ్ పడింది. ఫలితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గింగరాలు ...

Widgets Magazine