Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సెన్సేషన్ కోసం కాదు.. న్యాయం కోసం పోరాడాలి : శ్రీరెడ్డి వ్యవహారంపై పవన్ కామెంట్స్

శనివారం, 14 ఏప్రియల్ 2018 (14:40 IST)

Widgets Magazine

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై ఒంటరిపోరాటం చేసిన నటి శ్రీరెడ్డి. తన పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఆమె ఇటీవల అర్థనగ్న ప్రదర్శనకు దిగారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత తన విషయంలో హీరో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలంటూ శ్రీరెడ్డి మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా స్పందించలేదు.
srireddy
 
ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువాలో ఎనిమదేళ్ళ బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన పాశవిక చర్యకు నిరసనగా శనివారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో పలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్న జరిగింది. ఈ ధర్నాలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీరెడ్డి వ్యవహారంపై స్పందించారు. 
 
ఇండస్ట్రీలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని, కోర్టుకు వెళ్లాలని... అప్పుడే వారికి పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. అన్యాయానికి గురైనవారికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. టీవీలలో చర్చల వల్ల ఏమీ రాదని... కొన్ని రోజుల తర్వాత అందరూ మరిచి పోతారని, న్యాయం కూడా జరిగే అవకాశం ఉండకపోవచ్చన్నారు. పైగా, సెన్సేషన్ కోసం కాకుండా, న్యాయం కోసం నిజాయితీగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రేప్ చేస్తే కొట్టి చంపేసినా కేసులు పెట్టకూడదు : పవన్ కళ్యాణ్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువాలో ఎనిమిదేళ్ళ బాలికపై కొందరు కామాంధులు అత్యంత పాశవికంగా ...

news

బాలికలపై లైంగికదాడికి పాల్పడితే ఉరిశిక్షే : మేనకా గాంధీ ప్రతిపాదన

కేంద్ర మంత్రి మేనకా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో 12 యేళ్లలోపు బాలికలపై ...

news

ప్రధాని మోడీని దూషించినా.. వ్యతిరేక పాట పాడినా చేతులకు సంకెళ్లే...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యతిరేకంగా ఒక్క వ్యాఖ్య చేసినా సరే శిక్ష ...

news

అగ్రకుల దురహంకారంపై గొంతెత్తిన స్వరం… డాక్టర్ బీఆర్ అంబేద్కర్

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహేబ్ బీఆర్ అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు దేశ ...

Widgets Magazine