పవర్ స్టార్ కనిపించలేదా..? ఏమైయ్యాడు..?

Last Updated: శనివారం, 8 డిశెంబరు 2018 (10:50 IST)
తెలుగు పవర్ స్టార్ అంటే పవన్ కల్యాణ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇదే విధంగా తమిళ పవర్ స్టార్‌గా పేరున్న శ్రీనివాసన్ ప్రస్తుతం అదృశ్యమయ్యాడని భార్య జూలీ ఫిర్యాదు చేసింది. తర్వాత ఊటీలో ఉన్నాడని తెలియడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. ఈ వ్యవహారం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
వివరాల్లోకి వెళితే..  పోలీసులకు తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్ భార్య జూలీ ఫిర్యాదు చేసింది. అయితే అతడు ఊటీలో వున్నాడని తెలుసుకున్నాక.. గంటల వ్యవధిలోనే ఈ కేసును ఉపసంహరించుకుంది. పవర్ స్టార్ ఊటీకి వెళ్లేందుకు కారణం అతనిపై కేసులుండటమేనని పోలీసులు చెప్తున్నారు. శ్రీనివాసన్‌పై న్యూఢిల్లీతో పాటు రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. 
 
ఇటీవల ఓ వ్యక్తి డబ్బు విషయంలో మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఆయన కనిపించలేదని ఫిర్యాదు రావడం కోలీవుడ్‌లో కలకలం రేపింది. కానీ ఊటీలో వున్నాడని తెలుసుకున్న జూలీ శ్రీనివాసన్‌ను కలిసేందుకు వెళ్లింది.దీనిపై మరింత చదవండి :