తాజ్‌మహల్‌ను మీరు ధ్వంసం చేస్తారా? లేదా? : సుప్రీంకోర్టు

బుధవారం, 11 జులై 2018 (15:57 IST)

ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌‌మహల్‌ సంరక్షణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రపంచ వారసత్వ సంపదను సంరక్షించలేకుంటే ధ్వంసం చేయాలని లేదా తాజ్‌మహల్‌ను మూసివేసేలా ఉత్తర్వులు జారీచేస్తామని హెచ్చరించింది. ఈ విషయంలో కేంద్ర, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎన్నిసార్లు మొత్తుకున్నా తాజ్‌మహల్ సంవిషయంలో ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
tajmahal
 
నానాటికీ పెరిగిపోతున్న గాలి కాలుష్యం వల్ల పాలరాతితో నిర్మితమైన తాజ్‌మహాల్ రంగుమారిపోతోంది. ఈ అరుదైన కట్టడాన్ని సంరక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. తాజ్‌ను మూసివేయమంటారా? లేదా? మీరు ధ్వంసం చేస్తారా? లేదంటే ఆ కట్టడాన్ని సంరక్షించుకోవడానికి కావాల్సిన పునర్ నిర్మాణ పనులు చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని కోర్టు హెచ్చరించింది. 
 
ఈఫిల్ టవర్ కన్నా తాజ్‌మహల్ అందమైనదని, ఓ రకంగా ఫారెన్ ఎక్స్‌చేంజ్ సమస్యను తాజ్ తీర్చేదని న్యాయమూర్తులు తమ తీర్పులో వ్యాఖ్యానించారు. ప్రతి యేడాది ఈఫిల్ టవర్‌ను చూసేందుకు 80 లక్షల మంది వెళ్తుంటారని, అదో టీవీ టవర్‌గా కనిపిస్తుందని, కానీ మన తాజ్ మరింత అందమైందని, దాన్ని సరిగా చూసుకుంటే విదేశీ కరెన్సీ సమస్య ఉండేది కాదు అని జడ్జిలు అభిప్రాయపడ్డారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పరిపూర్ణానంద నగర బహిష్కరణ.. తప్పుబట్టిన కత్తి మహేష్

శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించడాన్ని ...

news

వీడొక మెంటల్‌గాడు.. యాక్సిడెంట్ జరిగితే...

సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోయినా.. ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారిని ...

news

ఇన్‌కంటాక్స్ రద్దు చేస్తే మోదీ వెంట మధ్య తరగతి ప్రజలు వెళ్తారా?

పెద్ద నోట్లు రద్దు చేయడం ద్వారా, నల్లధనాన్ని అరికట్టి, ఒకొక్కరి అకౌంట్‌లో రూ.15 లక్షలు ...

news

ఆదాయపన్ను రద్దు : ఇదే మోడీ పంద్రాగస్టు దినోత్సవ కానుక?

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేక నెలకొంది. ...