గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 28 మార్చి 2018 (12:17 IST)

పార్లమెంట్‌లో నారదుడు... వినూత్నరీతిలో శివప్రసాద్ నిరసన

విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలనీ, రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ పార్లమెంట్ వేదికగా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు గత కొన్ని రోజులుగా ఆందోళన

విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలనీ, రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ పార్లమెంట్ వేదికగా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, చిత్తూరు లోక్‌సభ సభ్యుడు శివప్రసాద్ ప్రతిరోజు వివిధ వేషధారణలో వస్తూ నిరసన తెలుపుతున్నారు. 
 
ఇందులోభాగంగా, ఆయన మరోసారి వినూత్నరీతిలో నిరసన తెలిపారు. బుధవారం ఉదయం నారదుడు వేషధారణలో పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీ శివప్రసాద్ 'వింటేనే ఉంటారు మోడీ' అంటూ పద్యం పాడుతూ నిరసన వ్యక్తంచేశారు. విభజన చేయవద్దు అని సోనియ గాంధీకి చెప్పిన ఏమైంది? అంటూ ప్రశ్నించారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'హరి హరీ... నేనీ మాటలు వినలేకపోతున్నాను. ఈ దృశ్యాలు చూడలేకపోతున్నాను. కాళ్లు పట్టుకోవడాలు ఏంటి? చనిపోయిన పూజ్యనీయులైన తల్లిదండ్రులపై అసభ్య పదజాలాలేంటి? అందుకే ఈ పార్లమెంట్ ఎందుకిలా తయారవుతుందో చూడాలని వచ్చాను. 
 
ఓం నమోనారాయణాయ. వేదంలోనే ఉంది ఓం నమోనారాయణాయ అని. 'నమో' అంటే నరేంద్ర మోడీ. 'నారా' అంటే నారా చంద్రబాబు నాయుడు అనుకున్నాను నేను. వాళ్లిద్దరూ కలసి ఆంధ్రప్రదేశ్‌ను గొప్పగా అభివృద్ధి చేస్తారనుకున్నాను నేను. కానీ, విభజన హామీలు నెరవేర్చకపోతే, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే, అభివృద్ధికి నిధులివ్వకపోతే, 'నారా' ఎందుకు 'నమో'తో ఉంటాడు? దుష్టుడికి దూరంగానే ఉంటారు. అంతే... నేను చెప్పాను. మోడీగారూ నా మాట వినండని చెప్పాను. ఆయన వినలేదు" అంటూ శివప్రసాద్ ఎద్దేవా చేశారు.