Widgets Magazine

#Budget2018 : పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా

గురువారం, 1 ఫిబ్రవరి 2018 (12:06 IST)

arun jaitley

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను గురువారం ఉదయం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇందులో వివిధ రంగాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ముఖ్యంగా. విద్యారంగానికి ఆయన నిధులు భారీ ఎత్తున కేటాయించారు. ఇందులోభాగంగా, విద్యా రంగంలో మౌలిక సౌకర్యాలకు రూ.లక్ష కోట్లు కేటాయించారు. 
 
అలాగే, గ్రామీణ పారిశుద్ధ్య పథకానికి రూ.16,713కోట్లు, మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.75వేల కోట్లు, ప్రతీ పౌరునికి సమీపంలో వెల్‌నెస్‌ సెంటర్లు, వాటి ఏర్పాటుకు రూ.1200కోట్లు, ప్రధాని సౌభాగ్య పథకంలో భాగంగా నాలుగు కోట్ల గృహాలకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు, రూ.330 ప్రీమియం చెల్లింపుతో 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామని, దీనివల్ల 50 కోట్లమంది వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని ఆయన ప్రకటించారు. 
 
అలాగే, క్షయ రోగుల సంక్షేమం కోసం రూ.600 కోట్లు. మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఒక కళాశాల ఏర్పాటు. 24 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. ముద్ర యోజన కింద చిన్న పరిశ్రమలకు రుణాలు ఇచ్చే యోచన ఉన్నట్టు తెలిపారు. జన్‌ధన్‌ యోజనలో భాగంగా 60 వేల కోట్ల బ్యాంకు ఖాతాలకు బీమా సౌకర్యం వర్తింపుచేసినట్టు తెలిపారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

ఆలు, ఉల్లి ఉత్పత్తిని పెంచేందుకు ఆపరేషన్ గ్రీన్: అరుణ్ జైట్లీ

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ సాధారణ బడ్జెట్‌ను ...

news

బడ్జెట్‌లో కీలకాంశాలు.. గ్రామీణ వ్యవసాయ మార్కెట్లకు రూ.2వేల కోట్లు

వ్యవసాయం దేసంలో ప్రధాన రంగం కావడంతో క్లస్టర్ విధానంలో భాగంగా వ్యవసాయాభివృద్ధికి చర్యలు ...

news

జైట్లీ పద్దుల చిట్టా : రైతుల సంక్షేమానికి పెద్దపీట

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2018-19 సంవత్సరానికి గాను వార్షిక ...

news

అవినీతి రహిత సర్కారు ఏర్పాటుకు కృషి, వ్యవసాయానికి పెద్దపీట: అరుణ్ జైట్లీ

అవినీతి రహిత సర్కారు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ...

Widgets Magazine