అందమైన కురుల నిగారింపు కోసం...

PNR| Last Modified మంగళవారం, 11 ఫిబ్రవరి 2014 (15:15 IST)
File
FILE
అందమైన జుత్తు అంటే నచ్చని వారెవరుంటారు. అది కేవలం అందానికే కాదండోయ్... ఆరోగ్యానికి చిహ్నాలు. జుత్తు రాలిపోతుంటే ఏదో లోపం ఉన్నట్లే. మరి ఇలాంటి జుత్తు నిగారింపుకు చిట్కాలంటే ఎవరికి తెలుసుకోవాలని ఉండదు చెప్పండి.

కొబ్బరి నూనెలో మందార పూలు వేసి కాచి వడపోయాలి. రోజూ కాస్త ఈ నూనె జుత్తుకు రాసుకుంటే ఖచ్చితంగా మెరుగైన ఫలితం ఉంటుంది. జుత్తు రాలడం తగ్గుతుంది. పైగా ఒత్తుగా పెరుగుతుంది. లీటరు నీటిలో 100 మి.లీ. వెనిగర్ కలిపి పెట్టుకోండి. స్నానం ముగించే చివరలో ఈ నీటిని జుత్తుకు పోసుకోండి. వెంట్రుకలు నిగనిగలాడుతాయి.

కుంకుడుకాయతే స్నానం చేసే వారు వారానికొకమారు కాస్త టీ డికాషన్‌ను కలిపి స్నానం చేయండి. ఇది జుత్తు పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. నిమ్మతొక్కలు, ఉసిరిక పొడి వాడితే జుత్తు రాలడాన్ని పూర్తిగా నియంత్రిస్తాయి. సంప్రదాయ అముదం నెలకొకమారైనా వాడితే ఆరోగ్యానికి ఆరోగ్యం, జుత్తు పెరగడం ఎక్కువవుతుంది.


దీనిపై మరింత చదవండి :