Widgets Magazine

వాలెంటైన్ డే స్పెషల్ : ముఖేష్ అంబానీ, నీతా అంబానీల లవ్ స్టోరీనే హాట్ టాపిక్!

శనివారం, 13 ఫిబ్రవరి 2016 (17:13 IST)

ప్రేమికుల రోజున పురస్కరించుకుని ప్రేమ జంటలు తమ ప్రేమను గుర్తు చేసుకోవడం లేదా తమ ప్రేమకు నాంది పలకడం వంటివి చేస్తుంటాయి. ఈ తరహాలో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఒక్కటైన ప్రేమ జంటలు ప్రేమికుల రోజున తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వాలెంటైన్ డే సెలెబ్రేషన్స్‌కప రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల లవ్ స్టోరీ హాట్ టాపిక్‌గా మారింది. 
 
ముఖేష్, నీతా అంబానీల జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ వ్యాపార విపణిలో పారిశ్రామికవేత్తగా ఎదిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, దివంగత ధీరూభాయి అంబానీ.. పెళ్లి విషయంలో తన పెద్ద కొడుకు ముఖేశ్‌ను కానీ, చిన్న కుమారుడు అనిల్ అంబానీని కానీ ఎప్పుడూ ఒత్తిడికి గురి చేయలేదు. ముఖేశ్ అంబానీ, నీతాల ప్రేమ పెళ్ళికి అంగీకరించారు. ఈ నేపథ్యంలో ముఖేశ్ అంబానీ లవ్ ప్రపోజల్‌ను నీతా ఎలా అంగీకరించారనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. 
 
ఇరు కుటుంబాల అంగీకారంతో ప్రేమ, డేటింగ్ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఓ ఆసక్తికర ఘటన తర్వాత పెళ్ళి చేసుకుంది. చదువు పూర్తయ్యేంతవరకు పెళ్ళిమాట ఎత్తకూడదని నీతా చెప్పడంతో.. అంబానీ ఆమెను ఎలాగైనా పెళ్ళికి ఒప్పించాలని డిసైడ్ అయ్యారట. అంతే రైడింగ్‌కు వెళ్తూ ముంబైలోని పోద్దార్ రోడ్డు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడితే, ముఖేశ్ కారు ఆపారు.
 
సరిగ్గా గ్రీన్ లైట్ పడుతుందనగా... ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ నీతాకు ప్రపోజ్ చేశారట. నీతా స్పందించేలోగా గ్రీన్ లైట్ వెలగడం.. వెనకున్న కారు హారన్లు మోగడంతో ఏమీ చేయలేకపోయిన నీతా.. ముందు కారు తీయమని చెప్పిందట. ఇందుకు అనిల్ అంబానీ ససేమిరా అనడంతో ఇక చేసేది లేక ‘ఎస్’ అని చెప్పేసిందట. ఇక అనిల్ పట్టలేని సంతోషంతో కారు స్టార్ట్ చేసి రుయ్‌మన్నాడట. ఇలా అనిల్, నీతా అంబానీలు ప్రేమ ద్వారా జీవిత భాగస్వామ్యులయ్యారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Proposed Nita Marriage Dating Mukesh Ambani Lovers Day

Loading comments ...

ప్రేమాయణం

news

ప్రేమికుల రోజు ఖర్చు రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు.. రొమాంటిక్ డిన్నర్‌కే ఓటు

ప్రేమికుల రోజును అట్టహాసంగా జరుపుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు రెడీ అవుతున్నారు. ...

news

843 అమ్మాయిలకు రోజా పువ్వులిచ్చిన విద్యార్థి: నా లవర్ గ్రేట్ అన్న ప్రేయసి!

అమెరికాలో ఓ విద్యార్థి వెరైటీగా అమ్మాయిలను ఇంప్రెస్ చేశాడు. తాను చదువుకుంటున్న స్కూళ్లో ...

news

ఆమెతో గడిపిన ఆ జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నా... ఆమె ఎందుకలా చేస్తుందీ...?

గత ఏడాదిగా ఓ అమ్మాయితో నాకు పరిచయం ఉంది. మేమిద్దరం యూనివర్శిటీలో చదువుతున్నాం. నాకు ...

news

ప్రేమను తెలపాలంటే ఎర్రగులాబీని ఎందుకు ఎంచుకుంటారు?

సౌందర్య సాధనంగా ఉపయోగించే పువ్వులు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పూలు ప్రేమను, ...

Widgets Magazine