శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (13:41 IST)

తులసి మొక్కను నాటక పోతే.. ఏమవుతుంది..?

తులసి మొక్కను వాస్తురీత్యా ఒక్క ఈశాన్యంలో తప్ప గృహం యందు ఎక్కడైనా ఉంచుకోవచ్చును. తులసిని గృహమునకు పశ్చిమం లేదా దక్షిణం యందు ఉంచుకోవడం చాలా మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. తులసిని బృందావనంలో నాటుకుని చుట్టూ ప్రదక్షిణ వచ్చేలా చేసుకోవడం శ్రేయస్కరం. 
 
శ్రీకృష్ణునికి ప్రీతి పాత్రమైన, ఆరాధ్య మొక్కగా పరిగణించే తులసిని మొక్కే కదా అని తీసి వేయరాదు. ఈశ్వురునికి బిల్వ పత్రం సమర్పించినట్లే శ్రీకృష్ణునికి తులసి మొక్కను సమర్పించి పూజిస్తారు. పూర్వ కాలంలో తులసి బాగుంటే ఇంటి యందు కీడు జరుగలేదని, తులసి వాడిపోయి... రాలిపోయి ఉంటే ఇంట కీడు జరగడానికి అవకాశం ఉందని నమ్మేవారు. 
 
అందుచేత ఇంటి యందు తులసిని పెంచుకోని వారు తక్షణమే వెళ్ళి తులసి మొక్కను నాటుకోవాలి. ఆరోగ్య రీత్యా కూడా తులసి చాలా మంచిది. విశిష్టమైన గుణాలు కలది. చివరికి తులసి గాలి సోకితేనే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. 
 
ఇటువంటి బృహత్తర శక్తి గల తులసిని ప్రతి దినం నీరు పోసి పూజించండి. తులసికి పూజ చేసే రెండు నిమిషాలైనా తులసి పక్కన ఉన్నట్లైతే ఎంతో మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.