గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By PNR
Last Updated : మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (18:45 IST)

సింహద్వార నిర్మాణం : చేకూరే ఫలములు!

గృహమునకు ప్రధానమైనది సింహద్వారం. ఇతర సింహద్వారాలు కూడా సమప్రాధాన్యత సంతరించుకుంటాయి. అలాంటి ద్వారాలను ఏర్పాటు చేసినప్పుడు తగిన సమయం, వాటికి కావలసిన దారువులు, వాటి ప్రమాణాలు ద్వారాలను నిర్మించు స్థలం కూడా ముఖ్యమైనవని వాస్తునిపుణులు తెలుపుతున్నారు. 
 
సింహద్వారానికి నిడివి 84 అంగుళాలు కలిగి, వెడల్పు 36 అంగుళాలు కలిగి ఉండాలని వాస్తు తెలుపుతోంది. కొందరు సింహ ద్వారానికి పొడవు తొమ్మిది వంతులు పెట్టి ద్వారాలు నిర్మించుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం గృహానికి ద్వారాలు నిర్మించుట ద్వారా ధనప్రదమని, ద్వారానికి తొమ్మిది వంతుల పొడవు, ఐదు వంతుల వెడల్పు కలిగివుండే విధంగా గృహ ద్వారాన్ని నిర్మించుకున్నట్లైతే శుభదాయకమని వాస్తు శాస్త్రం పేర్కొంటోంది. చెడు జాతులకు చెందిన చెట్ల దారువులతో ద్వారాలు నిర్మించినట్లయితే వ్యసనపరులు అవుతారని వాస్తు నిపుణులు చెపుతున్నారు.