గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. భవిష్యవాణి
  4. »
  5. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : గురువారం, 5 జూన్ 2014 (16:38 IST)

ఆగ్నేయంలో వంటగది ఉంటే.. శుభఫలితాలే!!

స్థలానికి తూర్పు-దక్షిణ వీధులుంటే అది ఆగ్నేయపు బ్లాక్ అవుతుందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ స్థలము ఉత్తర, ఈశాన్యముల కంటే ఆగ్నేయము ఎత్తుగా ఉండాలి. ఈ స్థలానికి ఆగ్నేయ భాగంలో నూతులు, గోతులు ఉండకూడదు. ఆగ్నేయ భాగంలో మరగుదొడ్డను నిర్మించుకోవచ్చునని వాస్తు నిపుణులు అంటున్నారు. వీటిని ఆగ్నేయ భాగములో రెండు సమభాగాలు వదిలేసి- దక్షిణగోడను ఆనుకుని నిర్మించటం శ్రేయస్కరం.
 
ఆగ్నేయభాగంలో దక్షిణ గోడకు ఆనుకునిగానీ, ఆనుకోకుండాగానీ నిర్మించిన మరుగుదొడ్డి ఎట్టి పరిస్థితుల్లోను గృహాన్ని తాకకూడదు. మరుగుదొడ్డికి, గృహానికి మధ్యన కనీసం మూడడుగుల ఖాళీ స్థలం ఉండి తీరాలని వాస్తు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఆగ్నేయ దిశలో అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్ వంటివి ఉండకూడదు. గృహం నిర్మించేటపుడు ఆగ్నేయమూలను కలపకుండా కొంచెం ఖాళీ వదలాలి. 
 
గృహము నందు ఆగ్నేయంలో కరెంట్ మీటర్లు గానీ, జనరేటర్లుగానీ ఆగ్నేయభాగములో ఉంటే శుభఫలితములు కలుగుతాయి. అయితే ఈ దిశలో ఆఫీస్ రూంలను నిర్మించటం శ్రేయస్కరం కాదు. గృహముల్లో ఆగ్నేయభాగమున వంటగది ఉంటే ఎన్నో శుభములు కలుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు చోటుచేసుకుంటాయి.