మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By chj
Last Modified: మంగళవారం, 18 అక్టోబరు 2016 (13:46 IST)

నిమ్మకాయల్లో అతీంద్ర శక్తులు... నిమ్మచెట్టు ఇంట్లో పెట్టుకుంటే...

ఆరోగ్యాన్ని కలిగించే ఔషధ గుణాలతోపాటు నిమ్మకాయల్లో కొన్ని అద్భుత శక్తులు దాగి ఉన్నాయని పెద్దలు చెబుతుంటారు. అందుకోసమే అనేకమంది తాంత్రికులు, అఘోరాలు దుష్ట శక్తులను పారద్రోలేందుకు నిమ్మకాయలను ఎక్కువగా వాడతారు. అనేకమంది తమతమ ఇండ్లు, దుకాణాల్లో నిమ్మకాయలన

ఆరోగ్యాన్ని కలిగించే ఔషధ గుణాలతోపాటు నిమ్మకాయల్లో కొన్ని అద్భుత శక్తులు దాగి ఉన్నాయని పెద్దలు చెబుతుంటారు. అందుకోసమే అనేకమంది తాంత్రికులు, అఘోరాలు దుష్ట శక్తులను పారద్రోలేందుకు నిమ్మకాయలను ఎక్కువగా వాడతారు. అనేకమంది తమతమ ఇండ్లు, దుకాణాల్లో నిమ్మకాయలను గుమ్మాలకు కడుతారు. దిష్టిని పారద్రోలే శక్తి నిమ్మకాయలకు ఎక్కువగా ఉంటుందని చాలా మందికి నమ్మకం.
 
అందుకే నివాసాలకు, షాపులకు, వాహనాలకు నిమ్మకాయలను ఎక్కువగా కడతారు. ముస్లిం దర్గాలలో సైతం దిష్టి పోవడానికి, దెయ్యాలు వదలడానికి అని నిమ్మకాయలను ఇస్తుంటారు. నిమ్మ చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఎలాంటి వాస్తు దోషాలు వర్తించవని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఆత్మలను తరిమికొట్టే శక్తి నిమ్మకాయలకు ఉందని చాలామంది నమ్ముతారు. 
 
అందుకే ఒకప్పుడు దెయ్యం పట్టిన వారికి మంత్రగాళ్లు నిమ్మకాయలతో పూజలు చేసేవారు. ఒక నిమ్మకాయను తీసుకుని దాన్ని 4 సమాన భాగాలుగా కత్తిరించి ఇల్లు లేదా షాపులో నాలుగు వైపులా ఆ ముక్కలను ఉంచాలి. ఆ ముక్కలను ఎండిపోయే వరకు అలాగే ఉంచాలి. ఇలా చేస్తే ఇల్లు లేక షాపుకు అన్ని విధాలా మంచి జరుగుతుందని ఎప్పటి నుండో పెద్దల నమ్మకం.