గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : గురువారం, 5 జులై 2018 (12:53 IST)

ఆలయాల్లో పాదరక్షలు దొంగలించబడితే మంచిదేనా? షూస్‌ను గిఫ్ట్‌గా ఇస్తే?

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఈశాన్య దిశలో షూ రాక్ లేదా షూ స్టాండ్ వుంచడం కూడదు. ఉదయాన్నే సూర్యకిరణాలు ముందుగా ఈ ప్రదేశంలో ప్రసరిస్తాయి... కాబట్టి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశించే చోట కాకుండా మరో చో

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఈశాన్య దిశలో షూ రాక్ లేదా షూ స్టాండ్ వుంచడం కూడదు. ఉదయాన్నే సూర్యకిరణాలు ముందుగా ఈ ప్రదేశంలో ప్రసరిస్తాయి... కాబట్టి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశించే చోట కాకుండా మరో చోట షూ రాక్‌ను వుంచుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ప్రవేశించే ముందు ఇంటికి కుడివైపున మాత్రమే షూలను వదిలిపెట్టాలి. 
 
ఒకవేళ మీ ఇంటి గుమ్మం తూర్పు లేదా ఈశాన్యం దిశలో ప్రవేశించేలా వుంటే ప్రవేశ ద్వారానికి దగ్గర్లో షూ రాక్ పెట్టకూడదు. అలాగే ఇంట్లో కానీ బయట కానీ షూలను వేలాడదీయకూడదు. ఇది అశుభానికి దారితీస్తుంది. తీవ్రమైన దురదృష్టం వెంటాడే అవకాశం వుంది. అంతేగాకుండా కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు తలెత్తేలా చేస్తాయి. 
 
ఇంకా షూస్ స్టాండ్‌లో ఒక షూపై మరొకటి, ఒక షూలో మరో షూను దూర్చి పెట్టడం కూడదు. ఇలా చేస్తే ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ దూరమయ్యే అవకాశం వుంది. ఇంట్లో ఎవరైనా మరణిస్తే వారి పాదరక్షలను దానం చేయాలి లేదా పూడ్చిపెట్టాలి. ఆ చెప్పులు ఇంట్లో వుండటం శుభ శకునం కాదు. షూస్‌ కొత్తవైనా సరే బెడ్ మీద, టేబుల్స్, మంచం కింద కాసేపైనా వుంచకూడదు. ఇలాచేస్తే ప్రతికూల ఫలితాలుంటాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే ఆహారం తీసుకునేటప్పుడు షూస్ వేసుకునే అలవాటుండేవారు ఇకపై మానుకుంటే మంచిది. ఆహారం తీసుకునే సమయంలో షూస్ విప్పి ఆపై ఆహారం తీసుకోవాల్సి వుంటుంది. అలా కాకుంటే నెగటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఒకవేళ బయటికెళ్లి తినాల్సి వచ్చినా.. షూస్‌ విప్పేసి ఆహారం తీసుకోవడం మంచిది.
 
ఇక పాదరక్షలు ఆలయాల వద్ద దొంగలించబడితే మంచిదని పెద్దలు చెప్తుంటారు. అయితే అన్ని రకాల చెప్పులకు ఈ మాట వర్తించదు. చర్మంతో తయారు చేయబడిన చెప్పులకు మాత్రమే ఈ మాట చెల్లుతుంది. ఎందుకంటే శని ప్రభావం చర్మం పైన, పాదాల పైన ఎక్కువగా వుంటుంది. చర్మంతో చేసిన పాదరక్షలు శనిస్థానాలు. 
 
కనుక అలాంటి చెప్పులను పోగొట్టుకున్నట్లైతే.. ఆ వ్యక్తి శని దోషాల నుంచి గట్టెక్కినట్లే. శుభాన్ని పొందినట్లేనని వాస్తు నిపుణులు అంటున్నారు. జ్యోతిష్యం ప్రకారం పాదరక్షలకు శనితో సంబంధం వుంటుంది. అందుకే శని దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు పాద రక్షలను దానం చెయ్యమని చెప్తుంటారు. 
 
ఇంకా పాదాలను ఆరోగ్యంగా వుంచుకునే వారు అవకాశాలను పొందుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఓ వ్యక్తి పాదాలే వారి గమ్యాన్ని సూచిస్తాయంటారు. అందుకే పాదరక్షల ఎంపికలో జాగ్రత్త వహించాలి. రెండు పాదరక్షలను ఒకే సైజులోనే ఎంపిక చేసుకోవాలి. అలాగే కార్యాలయాలకు వెళ్లే వారు బ్రౌన్ కలర్ షూస్ వాడకూడదు. ఇవి కార్యాలయాల్లో ప్రతికూల ప్రభావాన్ని ఏర్పరుస్తాయి
 
ఇతరులకు షూస్, చెప్పులు వంటివి కానుకగా ఇవ్వకూడదు. దొంగిలించబడిన లేదా కానుకగా వచ్చిన పాదరక్షలను ధరించకూడదు. అలాచేస్తే మీ అదృష్టాన్ని అవి వెనక్కి నెట్టేస్తాయని వాస్తు, జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పాడైన, చిరిగిన షూలను ధరించకూడదు. అవి మీ అదృష్టాన్ని కూడా దురదృష్టంగా మార్చేస్తాయని వారు సూచిస్తున్నారు.