గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జనవరి 2017 (12:20 IST)

దక్షిణం వైపు హాలు ద్వారం వద్దే వద్దు.. అతిథులు త్వరగా ఇంటి నుంచి వెళ్ళిపోవాలంటే..?

వాస్తు ప్రకారం హాలు ద్వారా దక్షిణ ద్వారం హాని కారకమట. ఈ దిశగా హాలు ద్వారం ఉన్నట్లైతే ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాస్తు నిపుణులు అంటున్నారు. అయితే హాలు ద్వారం తూర్పు

వాస్తు ప్రకారం హాలు ద్వారా దక్షిణ ద్వారం హాని కారకమట. ఈ దిశగా హాలు ద్వారం ఉన్నట్లైతే ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాస్తు నిపుణులు అంటున్నారు. అయితే హాలు ద్వారం తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు ఉంటే ధనలాభం, ఆరోగ్యం కలుగుతుంది.

దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయాలలో హాలు ద్వారం ఉంటే విజయం కలుగుతుంది కానీ అత్యధిక శ్రమ పడవలసి ఉంటుంది. పడమటి ద్వారం విద్యార్థులకూ, శాస్త్రవేత్తలకూ ఉపయోగకరంగా ఉంటుంది. వాయువ్యం వైపు హాలు యొక్క ద్వారం ఉండడం వల్ల సర్వతోముఖాభివృద్ధి కలుగుతుందని వాస్తు శాస్త్రం చెపుతోంది. 
 
ఇంకా వాస్తు ప్రకారం హాలు తూర్పు లేదా ఉత్తర దిశలలో ఉండటం మంచిది. ఒకవేళ మీది దక్షిణ ముఖంగా ఉన్న ఇళ్లైతే హాలు ఆగ్నేయంలో ఉండవచ్చు. ఉత్తరదిశ హాలుకి అత్యుత్తమమైనది. హాలు ఉండే దిశను బట్టి ఫలితాలు ఉంటాయి. మీరు ఎక్కువగా బంధువులతో స్నేహితులతో గడపడానికి ఇష్టపడేవారయితే మీ హాలుని నైరుతి లో ఉండేలా చూసుకోండి. 
 
బంధువులు, స్నేహితులకు దూరంగా ఉండాలనుకునేవారు, అతిథులు ఎక్కువ రోజులు ఉండకూడదనుకునేవారు.. హాలుని వాయువ్య దిశగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వాయువ్య దిశ వాయువుకు స్థానం. ఈ దిశలో కూర్చునే అతిథులు త్వరగా అలసిపోయి తమ ఇంటికి వెళ్లడానికి మొగ్గు చూపుతారని వాస్తు శాస్త్రం చెప్తోంది.