శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : శనివారం, 14 మార్చి 2015 (14:23 IST)

పిల్లలు చదువుకునేటప్పుడు ఏ దిక్కున కూర్చోవాలి?

పిల్లలు చదువుకునేటప్పుడు ఉత్తరము లేదా తూర్పు ముఖముగా కూర్చోవడం మంచిది. దక్షిణంలో బాల్కనీ ఉంటే ఉత్తరంలో కూడా బాల్కనీ ఉండి తీరాలి. అలా  లేనప్పుడు దక్షిణంలోని బాల్కనీకి పూర్తిగా గ్రిల్‌ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని వాస్తు నిపుణులు అంటున్నారు. 
 
అలాగే తూర్పు ఆగ్నేయంలో నిర్మించిన ఉపగృహానికి వంటకు ఉపయోగించుకోవచ్చా అనే సందేహముంటే.. ఎటువంటి అభ్యంతరం లేకుండా తూర్పు ఆగ్నేయంలో నిర్మించిన ఉపగృహంలో వంట చేసుకోవచ్చు. ఏ నష్టమూ ఉండదని వాస్తు నిపుణులు అంటున్నారు. 
 
అలాగే స్థలాన్ని కొనేటప్పుడు ఆగ్నేయం నుండి మొదలై, తూర్పు ఈశాన్యం పెరిగిన స్థలం, ఉత్తర-ఈశాన్యం పెరిగిన స్థలం, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలం అన్ని విధాలా మంచిది. ఇక ఇంటిని స్థలం హద్దుపై నిర్మించాలంటే.. ఇంటిచుట్టూ నడిచేవిధంగా ఖాళీస్థలం ఉంచి, ఇంటిని నిర్మించుకోవడం ఎంతో మంచిది. పడమర కన్నా తూర్పువైపున, దక్షిణము కన్నా ఉత్తరమున ఎక్కువ ఖాళీస్థలం వదిలి ఇంటిని నిర్మించుకోవడం చాలా మంచిది.