శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : బుధవారం, 18 మార్చి 2015 (19:07 IST)

పూజ చేసేటప్పుడు ఏ ముఖంగా ఉండి పూజ చేయాలి?

పూజ చేసేటప్పుడు ఏ ముఖంగా ఉండి పూజ చేయాలంటే..? ఇంటికి పూడ చేసేటప్పుడు పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చుని పూజ చేయాలి. లేదా ఉత్తరం ముఖంగా కూర్చుని పూజ చేయాలి. ఇంటిలో పడమర దక్షిణ ముఖంగా కూర్చుని పూజ చేయకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. 
 
అలాగే ఇంటి ఆవరణలో తూర్పు ఈశాన్యమున గాని, ఉత్తర ఈశాన్యమున గాని బోరు వేసుకోవచ్చును. తూర్పునగానీ, ఉత్తరమునగాని నీలు లభ్యము కానప్పుడు పడమరలో పంపు వేసుకోవచ్చు. 
 
ఇక నైరుతి ఇంటికి ద్వారం ఉండకూడదు. అది దక్షిణ నైరుతి అయినా, పడమర నైరుతి అయినా అక్కడ ద్వారం ఉండటం మంచిది కాదు. దక్షిణంలోగానీ (నైరుతి నుండి సగం దూరం దాటిన తర్వాత) దక్షిణ ఆగ్నేయంలో గానీ సింహ ద్వారాన్ని ఏర్పాటు  చేసుకోవచ్చు.