శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2015 (16:12 IST)

తూర్పు దిశగా తలవుంచి నిద్రించడం శుభప్రదం!.. వాస్తు టిప్స్!

తూర్పు దిశగా తలవుంచి నిద్రించడం శుభప్రదమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తర దిశ పనికిరాదు. దక్షిణ దిశను తలవుంచి నిద్రపోవడం ద్వారా ఆయుర్‌వృద్ధి, పడమటిదిశ శారీరక బలం కలిగిస్తుంది. ఉత్తర దిశ వ్యాధిని కలిగిస్తుంది. 
 
ఇకపోతే.. నూతన గృహ ప్రవేశానికి వైశాఖ, జ్యేష్ఠ, మాఘ, ఫాల్గుణ మాసాలు ఉత్తమం. పునర్వసు, స్వాతి, హస్త, అశ్విని, శ్రవణం నక్షత్రాలలో ప్రవేశం పనికిరాదు. ఇవి దుఃఖదాయకం. వృషభ, సింహ, వృశ్చిక, కుంభ లగ్నాలు ఉత్తమం. 
 
ఇంటి ఆవరణలో మర్రిచెట్టు, బొప్పాయి, జవ్వి.. వంటి పాలుగారే చెట్లు బలుసు వంటి పొదలు, జెముడు జాతికి చెందిన ముళ్ళ మొక్కలు, పత్తి బూరుగు వంటి దూది వెదజల్లే చెట్లు ఉండటం అరిష్టదాయకమని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.