మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : సోమవారం, 18 మే 2015 (18:47 IST)

ఇంటికి ఒకే సింహద్వారమైతే.. తూర్పు దిశ శ్రేష్ఠమట!

ఇంటికి ఒకే సింహద్వారం అయితే తూర్పు దిశ శ్రేష్ఠం. రెండు సంహిద్వారాలయితే తూర్పు-పశ్చిమ దిశల్లో ఉత్తమం. నలుదిక్కులా ద్వారాలు బహు శ్రేష్టం. తూర్పున ఏకద్వారం-ధనవృద్ధి, ఇదే ఏకద్వారం దక్షిణదిశన ఉంటే విజయం చేకూరుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు. 
 
పశ్చిమంలో ధన హాని, ఉత్తర దిశ సంపదలేమి, తూర్పున ఒకటి, దక్షిణాన ఒకటి.. మొత్తం రెండు సింహద్వారాలు అయినప్పటికీ కళత్ర పీడ తప్పదు. రెండు ద్వారాలు తూర్పు-పడమరలకు ఉంటే శుభపరిణామం. పుత్రవృద్ధి. దక్షిణ -పశ్చిమదిశలలో 2 సింహద్వారాలుంటే ద్రవ్యలాభం. తూర్పు - ఉత్తరదిశలు కష్ట నష్టాలు. ఉత్తర దక్షిణాలలో సింహద్వారాలు శత్రుభయం. ఉత్తర పశ్చిమాలు కీడులు. 
 
తూర్పు-పడమర-దక్షిణ దిశలలో 3 సింహద్వారాలుంటే సౌఖ్యలోపం, తూర్పు-ఉత్తర-దక్షిణాలలో సంపద, ఉత్తర-పశ్చిమాలలో కీర్తి వృద్ధి, తూర్పు-ఉత్తర- పశ్చిమాలు కీర్తి సంపదలు చేకూరుతాయి.