గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : శనివారం, 6 జూన్ 2015 (17:31 IST)

వాస్తు టిప్స్: నిమ్మ చెట్టు ఇంట్లో ఉండవచ్చా? తులసి చెట్టును ఇంటి మధ్యలో..?

నిమ్మ, అన్ని రకాల సాత్త్విక పుష్పజాతులు, పనస, జాజి, మోదుగ, నూరాకుల చెట్టు వంటివి ఇంట్లో పెంచదగినవి. గృహావరణంలోనికి గాలిని సూర్యరశ్మిని ప్రసరించడంలో అడ్డగించేవి ఎంత గొప్ప వృక్షాలైనా నిషేధమని గమనించాలి. తులసి కోటను, అందులో తులసి చెట్టును ప్రతిదినము పూజించుట సర్వదా శ్రేష్ఠమైనది. గృహం మధ్యలో తులసి చెట్టును ప్రతిష్ఠించడం, సర్వదోషాలను దూరం చేసుకోగలుటయేనని వాస్తు నిపుణులు అంటున్నారు. 
 
తూర్పు సింహద్వార గృహమును దిక్సూచీ సహాయముతో ఈశాన్య దిశను చూసినట్లు నిర్మించినచో ఐశ్వర్యము, సంతానవృద్ధియు కలుగును. దక్షిణ సింహద్వార గృహం కేవలం దక్షిణాన్ని చూస్తున్నట్లు నిర్మించినచో ఐశ్వర్యం కలుగును. 
 
పశ్చిమ సింహద్వార గృహం కేవలం పశ్చిమ దిశను చూస్తున్న రీతిలో నిర్మించినచో భోగభాగ్యాలు సమృద్ధిగా ఉండును. ఉత్తర సింహద్వార గృహం ఈశాన్యాన్ని చూస్తున్నట్లు నిర్మిస్తే ఐశ్వర్య దాయకం. వెన్ను ఉత్తరం వైపు ఎత్తుగా ఉన్నచో ధననాశనం, క్రిందకు వంగి వున్నట్లయితే ఐశ్వర్య కారమని వాస్తు నిపుణులు అంటున్నారు.