శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Chitra
Last Updated : శనివారం, 2 జనవరి 2016 (14:42 IST)

ఉత్తరంలో చెత్తడబ్బా, చీపురు, వాషింగ్‌ మెషీన్‌లు ఉంచవచ్చా?

జీవించేందుకు సౌకర్యవంతమైన ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే సొంతింటి కళ నెరవేర్చుకుంటే మాత్రం సరిపోదు, వాస్తుకు చెందిన మెలకువలు తెలుసుకోవాలి. వాస్తు ప్రకారం ఇల్లుంటే లక్ష్మీదేవి కొలువవుతుందని, సంపద సృష్టికి మార్గమవుతుందని వాస్తు పండితులు అంటున్నారు. 
 
* ఇంటి ఉత్తర ప్రాంతంలో నీలిరంగు వేయాలి. ఇక్కడ వంటగది, టాయ్‌లెట్లు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ ప్రాంతంలో చెత్తడబ్బా, చీపురు, వాషింగ్ మెషీన్‌లను ఉంచవద్దు. వంటగది అంటే అగ్నిదేవుడు కొలువై ఉండే ప్రాంతం. ఏదైనా వస్తువులు తప్పుడు స్థానంలో ఉంచితే, డబ్బు నీళ్లలా ఖర్చవుతుంది. కెరీర్ దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి.
 
* అన్ని ప్రాంతాలలో ఈశాన్య ప్రాంతం ఎంతో ముఖ్యమైనది. ఈశాన్య ప్రాంతంలో నిబంధనలు పాటిస్తే, బ్యాంకుల నుంచి ఋణాలు సులభంగా అందుతాయి. ఇతరుల నుంచి పెట్టుబడులు చేకూరుతుంది. వాస్తుని పాటించిన గృహాలు నిత్యం సకలసంపదలతో కళకళలాడుతూ ఉంటుంది.
 
* ఇంటి ప్రధాన ద్వారం అందంగా ఉంటే సంతోషంతో పాటు శ్రేయస్సు సిద్ధిస్తుంది. ఇంటికి పచ్చని తోరణాలు మంచి రంగులు, గడపకు పసుపు కుంకుమలతో అలంకరిస్తే సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతుంది. కష్టాలు దూరంగా జరుగుతాయి. ఉదాహరణకు వాయవ్యంలో తలుపుంటే రుణాలు, ఆర్థిక సమస్యలు వస్తాయి. ఉత్తరంలో ద్వారముంటే, మంచి కెరీర్, ఆర్థిక స్థిరత్వం సుసాధ్యం. తూర్పున తలుపున్న ఇంట శాంతి సిద్ధిస్తుంది. పశ్చిమాన తలుపుంటే ధనలాభాలు లభిస్తుంది. దక్షిణాన తలుపున్నా మంచిదే.
 
* ఆగ్నేయాన వంటగది ఉండాలి. లేత ఎరుపు, నారింజ, గులాబీ రంగులు సూచించే కలర్స్ వేస్తే మంచిది. బీరువా, పని చేసుకునే టేబుల్, డ్రాయింగ్ రూం తదితరాలు ఉత్తరం వైపున ఉంటే సరిపడినంత ధనం లభించే అవకాశాలుంటాయి.
 
* పడమర వైపున తెలుపు, పసుపు రంగులు శుభసూచకం. ఇక ఇంట్లోని నైరుతీ ప్రాంతం సేవింగ్స్‌ను సూచిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లల చదువులకు వినియోగించవచ్చు.ఈ ప్రాంతంలో బీరువాను ఉంచి డబ్బు, ఇతర విలువైన వస్తువులు ఉంచితే అవి కలకాలం భద్రంగా ఉంటుంది. ఈ నిబంధనలు పాటిస్తే, ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ సమతూకంగా ఉంటూ సుఖశాంతులు, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి.