శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : గురువారం, 21 జనవరి 2016 (16:59 IST)

గడపపై కూర్చోవడం మంచిదా? అలా కూర్చుంటే ఏమౌతుందో తెలుసా?

ఇంటికి ప్రధాన ద్వారంపై కూర్చోవడం మంచిదా? అలా కూర్చుంటే అరిష్టం, దారిద్ర్యమా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. ఇంటికి ప్రధాన ద్వారానికి గల గడపపై కూర్చోకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ప్రధాన ద్వారానికి సాధారణంగా బేసి సంఖ్యలో మెట్లుండాలి. ఇంకా గడపపై కూర్చోవడం మంచిది కాదని వారంటున్నారు. కిటికీలు, ద్వారాల ద్వారానే గాలి, వెలుతురు ఇంటిలోకి వచ్చి వెళ్తూంటాయి.

అలాంటప్పుడు ఇంట్లోకి వచ్చే గాలిని, వెలుతురును, ఇంటిలోపల గల నెగటివ్‌ ఎనర్జీ బయటికి తీసుకెళ్లే గాలిని గడపపై కూర్చుని అడ్డుకోవడం సైన్స్ పరంగా మంచిది కాదని.. ఇలా చేయడం ద్వారా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇక ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే.. గడపకు మధ్యలో కూర్చోవడం మంచిది కాదు. గడపపై కూర్చోవడం, గడపకు దిగువనున్న మెట్లపై కూర్చోవడం కూడా అంత మంచిది కాదు. అలా కూర్చుంటే ఇంటిలోనికి వచ్చే లక్ష్మీదేవిని అడ్డుకున్న వారవుతామని పండితులు అంటున్నారు. అంతేగాకుండా ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు.. ప్రధాన ద్వారం అమర్చేటప్పుడు పూజలు నిర్వహించి, నవరత్నాలు, పంచలోహ వస్తువుల్ని ప్రధాన ద్వార గడప కింద ఉంచడం ఆనవాయితీ.

అందుకే ప్రధాన ద్వారాన్ని దైవాంశంగా, లక్ష్మీదేవిగా పూజిస్తాం. కాబట్టి దైవాంశం నిండిన ప్రధాన ద్వారం (గడప)పై కూర్చోవడం.. లక్ష్మీదేవిని అవమానించినట్లవుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా ఇలా కూర్చోవడం ద్వారా ఈతిబాధలు ఉత్పన్నమవుతాయని, అరిష్టమని వారు సూచిస్తున్నారు.