శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Modified: శుక్రవారం, 1 మార్చి 2019 (11:52 IST)

బంగళాకు మేడమీదకు వెళ్లే మెట్లు గేటులో పడవచ్చా..?

ఇప్పటి కాలంలో ఎక్కడ చూసినా బంగళాలు నిర్మాణాలు ఎక్కువైపోతున్నాయి. కానీ, వీటి నిర్మాణంలో మేడమీదకు వెళ్లే మెట్లు గేటులో పడవచ్చా.. వద్దా అనే విషయాన్ని తెలుసుకోవడానికి సతమతమవుతుంటారు. అలాంటి వారికోసం..
 
ఇంటిని స్థలాన్ని బట్టి నిర్మిస్తే గేట్లు, ద్వారాలు వేటికవి స్వతంత్రంగా నిలబడగలుగుతాయి. తక్కువ జాగలో ఎక్కువ ఇల్లు ఉండడం వలన అనేక తప్పులు జరుగుతుంటాయి. ఇంటిగేటు ఎంత వెడల్పు అవసరమో చూసుకుని ఉత్తరం అంత వెడల్పు ఏ నిర్మాణం రాకుండా చూసుకోవాలి. మీరు మీ తూర్పు ఈశాన్యం గేటుకు ఎదురుగా కాకుండా తూర్పు ఆగ్నేయంలో మెట్లు నిర్మించుకోవాలి.
 
ఇంటి పొడవు కొంత వరకు తగ్గించుకుంటే తూర్పు ఆగ్నేయం మెట్లు చక్కగా వేసుకోవచ్చు. ఇంటి స్థలం పడమరలలో దీర్ఘచతురస్రంగా ఉన్నప్పుడే ఉత్తరం విడిచిన ఖాళీలలో ఏవీ రాకుండా చూసుకోవాలి. తద్వారా మీకు ఉత్తమ ఆరోగ్య ఫలాలు అందుతాయి. గేట్లలో మెట్లు పడకుండానే జాగ్రత్త పడడం మంచిది. 
 
తప్పనిసరి ఉత్తర వాయవ్యంలో మెట్లు వేస్తే ఆ భాగం వదిలి ఇంటి ఈశాన్యం గది వెడల్పుతో గేటును జరిపి కట్టాలి. అప్పుడే మీ సింహద్వారానికి ఎదురుగా గేటు వస్తుంది. అది కూడా చాలా శుభకరం. పూర్తి ఈశాన్యంలోనే గేటు ఉండాలని లేదు. ఇంటి ప్రధానం ద్వారంలో గేటు పిల్లర్స్ పడకుండా చూసుకుని సరి చేసుకోవాలి.