శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : శనివారం, 18 అక్టోబరు 2014 (18:29 IST)

వాస్తు టిప్స్ : పాలుగారే చెట్లు, ముళ్లు ఇంటి ఆవరణలో?

ఇంటి మీద దేవాలయం నీడగాని, గుడి ధ్వజస్తంభం నీడగానీ పడకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. అలాగే ఇంట్లో ఎప్పుడూ తూర్పు ముఖంగానే వంట చేయాలి. తూర్పు ముఖముగా లేదా ఉత్తర ముఖముగా భోజనం చేసే విధంగానే డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసుకోవాలి. 
 
పాలుగారే చెట్లు, ముళ్లు ఉన్న చెట్లు ఇంటి ఆవరణలో అస్సలు ఉండకూడదు. ఈశాన్యములో బావిని తూర్పు లేదా ఉత్తర ప్రహరీ గోడలకు ఆనించి నిర్మించకూడదు. కొత్త ఇంటికి  పాత ఇంటి సామాన్లు వాడకూడదు. మెట్లు తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యాలలో ఏమాత్రం నిర్మించరాదు. తులసికోట వంటింటి గుమ్మానికి ఎదురుగా గానీ, ఈశాన్య దిక్కుకుకాని నిర్మించుకోవచ్చు.