గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : శనివారం, 9 ఆగస్టు 2014 (12:24 IST)

వాస్తు ప్రకారం తులసికోట అమరిక ఎలా ఉండాలి?

హిందువులు దేవతగా పూజించే తులసి కోట ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అయితే మీ కొత్త ఇంటిలో దీనిని ఎక్కడ పెట్టాలి. ఏ విధంగా, ఏ దిశలో ఏ వైపు నిర్మించుకోవాలో అన్న విషయాలను తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మీకోసం...
 
మీ తులసి కోటను చుట్టూ తిరిగే విధంగా తప్పకుండా స్థలం ఉంచుకోవాలి. అలాగని వీటిని ప్రహరీ గోడలకు ఆనించి నిర్మించకూడదు. ఉత్తర వాయవ్యంలో లేదా తూర్పు వాయవ్యంలో తులసి కోటను అమర్చాలనుకుంటే నేల ఎత్తుకంటే కాస్త తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. 
 
పశ్చిమ దిశలో అంటే నైరుతి లేదా వాయవ్య దిశలలో తులసి కోటను నిర్మించాలంటే నేల ఎత్తుకంటే కాస్త ఎక్కువగా లేదా కాస్త తక్కువగా ఉండేటట్టు ప్లాన్ చూసుకోవాలి. అలాగే దక్షిణదిశలో నిర్మించుకోవాలనుకుంటే నేలకు సమానంగా ఉండకుండా కాస్త ఎత్తుగా లేదంటే పల్లంగా ఏర్పాటు చేసుకోవాలి. 
 
అంతే కాకుండా తూర్పు ఈశాన్యం, ఈశాన్యం, ఉత్తర ఈశాన్య దిశలలో తులసి కోటలను ఉంచకూడదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో బరువు ఎక్కువై చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అయితే పూర్వంలోలా ప్రస్తుత కాలంలో తులసికి కోటలు కట్టడం లేదు. పూల మొక్కలు పెంచే వాటిలోనే పెంచుతున్నారు. అయినప్పటికీ, వీటిని దక్షిణ ఆగ్నేయ, పశ్చిమ వాయవ్య దిశలలో పెట్టాలి.