గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (18:26 IST)

వాస్తు టిప్స్ : ఇంట్లో దొంగలు పడకుండా ఉండాలంటే?

ఇంట్లో దొంగలు పడకుండా ఉండాలంటే? ముందుగా ఇంటిని సురక్షితంగా నిర్మించుకోవాలి. తలుపులు, వాటి అమరిక, వాటి సైజు, నెంబర్లను సరిగ్గా చెక్ చేసుకుని అమర్చుకోవాలి.  ఇంటికి ప్రధాన ద్వారమే దొంగతనాలను జరగనీయకుండా చేస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇక దొంగతనానికి చెక్ పెట్టే బేసిక్ వాస్తు రూల్స్ ఏంటో తెలుసుకుందాం.. 
 
వాస్తు ప్రకారం వాయవ్య దిశలో విలువైన వస్తువులు, నగదును ఉంచకూడదు. అలాగే ఇంటికి నైరుతి వైపును అద్దెకు వదలడం లేదా పనిమనుషులకు ఇవ్వడం చేయకూడదు. ఇవన్నీ దొంగతనం జరిగేందుకు కారణాలవుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. 
 
ఇంటి ప్రధాన ద్వారాలు ఇతర డోర్స్ కంటే పెద్దవిగా ఉండేట్లు చూసుకోవాలి. ప్రధాన ద్వారాలు 2, 4, 6, 8, 12 సంఖ్యలో డోర్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే పదో నెంబర్‌ను మాత్రం వాడుకోకూడదని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. మెయిన్ ఎంట్రెన్స్‌కు రెండు ఓపెనింగ్ షటర్స్ వుండేలా చూసుకోవాలి. 
 
ప్రధాన ద్వారంలో ఓం, స్వస్తిక్, లక్ష్మి, గణేష బొమ్మలను వేలాడదీయండి. గణేష బొమ్మను మెయిన్ ఎంట్రెన్స్‌లో తగిలించడం ద్వారా అప్పుల బాధలు ఉండవు. దొంగతనాలు జరగవు. అలాగే పద్మంలో కూర్చున్నట్లున్న లక్ష్మీ పటాన్ని ఇంటికి నేరుగా తగిలించడం ద్వారా శత్రుభయం, ఈతిబాధల, ఆర్థిక సమస్యలు దరిచేరవని వాస్తు నిపుణులు చెబుతున్నారు.