శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2014 (13:48 IST)

విజయ దశమి : వాస్తు పురుషుడిని పూజించండి

విజయ దశమి సాయంత్రం వాస్తు పురుషుడిని పూజించండి. ఎలాగంటే వాస్తు పురుష యంత్రాన్ని ముందుగా సిద్ధం చేసుకోండి. ఈ యంత్రాన్ని నివాసంలో ఉంచండి. 
 
ఈ యంత్రాన్ని ఉంచి వాస్తుపరమైన దోషాలుంటే తొలగించాల్సిందిగా అమ్మవారిని ప్రార్థించండి. అమ్మవారికి ముందుగా యంత్రాన్ని ఉంచండి. నైవేద్యంగా తీపి పదార్థాలను ఉంచండి. ధూపదీపాలను చూపాలి. 
 
విజయదశమి రోజున విజయకాలంలో అంటే సాయంకాలం ఈ పూజ చేపట్టాలి. ఇలా చేయడం ద్వారా ఆ కుటుంబానికి క్షేమం కలగడం ఖాయమని పండితులు చెబుతున్నారు.