శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (17:28 IST)

వాస్తు సలహాలు.. ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశను..!

వాస్తు ప్రకారం ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశను చూడటం వలన కుబేరస్థానాన్ని చూసినట్లవుతుంది. దీనివల్ల ధనాదాయం ఎప్పుడూ బాగుంటుంది. పక్కమీద నుండి దిగగానే తూర్పువైపుకు కొంచెం నడక సాగించడం మంచిది. దీనివలన తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. మంచి లాభాలు పొందుతారు. 
 
లెట్రిన్‌లో-దక్షిణాభిముఖంగా గానీ ఉత్తరాభి ముఖంగా గానీ కూర్చోవాలి. తూర్పు, పడమరలకు అభిముఖంగా కూర్చోకూడదు. గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యంలో ప్రారంభమై నైరుతివైపుకు చెత్తను ప్రోగు చేయాలి. ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదు. 
 
ఆగ్నేయమూల వంట చేసేటప్పుడు తూర్పు అభిముఖంగా నించుని వంట చేయాలి. ఇంటిని చిమ్మే చీపురు శనికి ఆయుధం. కాబట్టి గోడకు ఆనించేటప్పుడు చీపురు హేండిల్ పైకి మాత్రమే పెట్టి ఉంచడం శుభకరం. ఈశాన్యములో దేవుని మందిరాలు నిర్మించి పూజ చేయకూడదు. దీనివల ఈశాన్యం మూత పడటం జరుగుతుంది. తూర్పు గోడలోనే దేవుని గూడును ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం.