శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 1 డిశెంబరు 2014 (14:05 IST)

ఇన్‌స్టంట్ బ్రేక్ ఫాస్ట్: అటుకుల పులిహోర

అటుకుల పులిహోర ఇన్‌స్టంట్ బ్రేక్ ఫాస్ట్‌గా రెడీ చేసేయొచ్చు. కొన్ని పోపు దినుసులు, కాస్త పులుపు జోడించి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఎలా చేయోలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
అటుకులు - రెండు కప్పులు 
పసుపు - అర టీ స్పూన్ 
చింతపండు గుజ్జు - అర టీ స్పూన్
నూనె - మూడు టీ స్పూన్లు 2tsp
ఆవాలు - ఒక టీ స్పూన్లు 
ఇంగువ : చిటికెడు
శెనగపప్పు: రెండు టీ స్పూన్లు 
ఎండుమిర్చి: నాలుగు 
పచ్చిమిర్చి: రెండు 
వేయించిన వేరుశెనగలు: నాలుగు టేబుల్ స్పూన్లు 
కరివేపాకు: కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
పోపుకోసం- తగినంత
 
తయారీ విధానం :
ముందుగా అటుకులను శుభ్రంగా కడిగి.. నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి. వీటికి కొద్దిగా ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు జోడించి బాగా స్పూన్‌తో మిక్స్ చేసి పెట్టుకోవాలి. 
 
స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత అందులో ఇంగువ, శెనగపప్పు, ఎండుమిర్చి, వేరుశెనగలు, ఉప్పు మరియు కరివేపాకు వేసి ఈ మొత్తం మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
 
పోపు వేగిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకొన్న అటుకులను వేసి బాగా మిక్స్ చేయాలి. రుచికి సరిపడా ఉప్పు సరిచూసుకొని 3-5నిముషాలు మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. అంతే అటుకుల పులిహోర రెడీ.