శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By PNR
Last Updated : గురువారం, 16 అక్టోబరు 2014 (14:39 IST)

బీట్‌రూట్ ఖీర్ తయారీ ఎలా?

తీసుకోవలసిన పదార్ధాలు:
బీట్‌రూట్ - 1(మీడియం సైజులో)
పాలు - అర లీటరు, 
చక్కెర - ఒక కప్పు, 
ఆల్మండ్ ఎస్సెన్స్ - ఒక టేబుల్ స్పూను.
 
ఇలా తయారు చేయండి: ముందుగా బీట్ రూట్‌ను శుభ్రంగా కడుక్కొని దానిపై తొక్కను తొలగించాలి. అనంతరం బీట్‌రూట్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టౌమీద బాణళి వేడెక్కాక బీట్‌రూట్ ముక్కలను వేసి.. అందులో సరిపడినంత పాలు పోయాలి.
 
ఈ మిశ్రమాన్ని ఎక్కువగా సేవు స్టౌ మీద కొద్దిసేపు వేయించాలి. ఆ తర్వాత మిగిలిన పాలను స్టౌమీద బాగా వేడి చేయాలి. ఇప్పుడు ఉడికించిన బీట్‌రూట్ ముక్కలను బాగా రుబ్బుకుని దానికి కాగిన పాలను జోడించాలి. ఈ మిశ్రమాన్ని ఓ ఐదు నిమిషాల పాటు స్టౌమీద పెట్టాలి. 
 
కాసేపటి తర్వాత కాగిన ఈ మిశ్రమానికి చక్కెర కలుపుకోవాలి. అనంతరం స్టౌ మీద నుంచి దించేసి కాసేపు చల్లారిన తర్వాత అందులో ఆల్మండ్ ఎస్సెన్స్ కలుపుకోవాలి. దీంతో బీట్‌రూట్ ఖీర్ రెడీ. దీన్ని చల్లగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.