శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By CVR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (18:15 IST)

బ్రేక్ ఫాస్ట్ స్పెషల్ : ఇన్ స్టంట్ దోసె

కావల్సిన పదార్థాలు: 
రవ్వ - రెండు కప్పులు 
పెరుగు - ఒక కప్పు 
నీళ్ళు - అర కప్పు 
కూరగాయలు (ఉల్లిపాయల, క్యాప్సికమ్, టమోటో, క్యారెట్, పచ్చిబఠానీలు) - కలిసి ఒక కప్పు
కొత్తిమీర - కొద్దిగా (తరిగి పెట్టుకోవాలి) 
పచ్చి మిరపకాయలు - రెండు (సన్నగా తరిగినవి) 
మిరియాల పొడి - చిటికెడు 
ఉప్పు - తగినంత 
నూనె - ఫ్రై చేయడానికి తగినంత 
 
తయారుచేయండి ఇలా: మొదట ఒక గుంత గిన్నెను తీసుకుని అందులో రవ్వ, పెరుగు వేసి, వాటిలో కొంచం నీళ్లు చేర్చి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒకటి లేదా రెండు గంటల తర్వాత అందులో కూరగాయల ముక్కలను, కొత్తిమీర తరుగు, పచ్చి మిరపకాయలు, మిరియాలపొడి, రుచికి సరిపడ ఉప్పు చేర్చి బాగా కలుపుకోవాలి.  
 
ఇప్పుడు తయారు చేసుకున్న పిండిని మరోసారి కలుపుకోవాలి. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, నూనె రాసి వేడి చేసి, పిండిని కొద్దిగా తీసుకొని తవా మీద దోసెలా వేసుకోవాలి. వేసుకొన్న తర్వాత రెండువైపుల బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చుకోవాలి. అంతే వేడి వేడి ఇన్ స్టంట్ దోసె రెడీ.