శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By PNR
Last Updated : మంగళవారం, 14 అక్టోబరు 2014 (14:03 IST)

క్యాప్సికమ్ మసాలా కర్రీ తయారీ ఎలా?

కావలసిన పదార్థాలు : 
క్యాప్సికమ్ - 250 గ్రాములు, 
ఉల్లిపాయలు - మూడు, 
చింతపండు గుజ్జు - రెండు చెంచాలు, 
పచ్చిమిర్చి - మూడు, 
జీలకర్ర పొడి - అర చెంచా, 
నూనె - వేయించడానికి సరిపడ, 
పసుపు - చిటికెడు, 
కారం - చిటికెడు 
 
తయారు చేయు విధానం : 
ముందుగా క్యాప్సి‌కమ్‌ను గుత్తుగా కోసుకుని ఉంచుకోవాలి. అలాగే ఉల్లి, పచ్చిమిర్చిలను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. బాణాలిలో నూనె వేసి కాగాక, చిటికెడు ఆవాలు, మినపప్పు, జీలకర్ర పొడి, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసి దోరగా వేయించి దించాలి.
 
దీనికి తగినంత ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బి చింతపండు పిప్పి, పసుపులను వేసి కలిపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని క్యాప్సికమ్‌లో పెట్టి ప్యాన్‌లో పెట్టి మూత వేసి ఉడికించాలి. మూతపై కాసిన్ని నీళ్లు పోయాలి. ఇలా చేస్తే ముక్కలు త్వరగా ఉడుకుతాయి. తర్వాత దించి సర్వ్ చేయాలి.