Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మధుమేహంతో బాధపడుతుంటే.. బార్లీ ఇడ్లీలు తినండి..

మంగళవారం, 5 డిశెంబరు 2017 (10:40 IST)

Widgets Magazine

మధుమేహంతో బాధపడేవారి బార్లీ గింజలు ఎంతో మేలు చేస్తాయి. కేలరీలు తక్కువగా వుండే బార్లీ గింజలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. తృణధాన్యాల్లో రాజు అయిన బార్లీ గింజల్లో బియ్యం కంటే తొమ్నిది రెట్లు పీచు ఎక్కువగా వుంటుంది. బార్లీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువును తగ్గిస్తుంది.

శరీర రక్తంలోని చక్కెర స్థాయులను తగ్గిస్తుంది. తద్వారా మధుమేహాన్ని నియంత్రిస్తుంది. రక్తహీనతకు చెక్ పెడుతుంది. హృద్రోగ  సమస్యలను దూరం చేస్తుంది. క్యాన్సర్‌తో పోరాడే బార్లీ గింజలను వారానికి రెండుసార్లు ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి బార్లీ గింజలతో మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు చేసే ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
బార్లీ గింజలు - ఒక కప్పు
ఉప్పుడు బియ్యం - రెండు కప్పులు
మినుములు - ఒక కప్పు
మెంతులు- అర స్పూన్‌
ఉప్పు - తగినంత
తరిగి, ఉడికించిన క్యారెట్‌, చిక్కుడు ముక్కలు - ఒక కప్పు
 
తయారీ విధానం:
ముందుగా మినపపప్పు, మెంతులు, ఉప్పుడు బియ్యాన్ని కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వీటిలో బార్లీ గింజలు చేర్చి ఇడ్లీ పిండి రుబ్బుకోవాలి. ఈ పిండికి తగినంత ఉప్పు కలుపుకుని ఐదు గంటల పాటు పక్కనబెట్టాలి. ఐదు గంటల తర్వాత పిండిని బాగా కలిపి.. ఇడ్లీ రేకుల్లో నెయ్యి రాసి పిండి ఇడ్లీల్లా వేసుకోవాలి. తరిగిన కూరగాయ ముక్కలను పైన వేసుకోవాలి. అరగంట 20 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే  బార్లీ ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీని సాంబార్ లేదంటే మీకు నచ్చిన చట్నీతో వడ్డిస్తే టేస్ట్ అదిరిపోతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

వంటకాలు

news

#SRMgroup రమదా ప్లాజాలో క్రిస్మస్ కేక్ మిక్సింగ్

చెన్నైలోని ఐదు నక్షత్ర హోటల్ రమదా ప్లాజాలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కేక్ ...

news

మునగ- టమోటా కలిపి తింటే...

మునగలో క్యాల్షియం ఎక్కువ. పెరిగే పిల్లలకు, గర్భిణులకు ఇది దివ్యౌషధం. పీచుపదార్థం ...

news

కూరలో ఉప్పు ఎక్కువైతే మీగడ కలిపేయండి..

కూరలో ఉప్పు ఎక్కువైతే కంగారు పడకుండా.. రెండు స్పూన్ల పాల మీగడ కలిపేయండి. ఉప్పదనం కాస్త ...

news

పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే పనీర్ చికెన్ గ్రేవీ

ముందుగా పాన్ తీసుకుని అందులో నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులో కట్ చేసుకున్న పనీర్ ...

Widgets Magazine