గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 జనవరి 2015 (15:37 IST)

హెల్దీ బ్రేక్ ఫాస్ట్ రైస్ రోటీ ఎలా చేయాలి?

అన్నంలోని కార్బొహైడ్రేడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అన్నంను అలాగే తీసుకోకుండా రోటీల రూపంగా తీసుకుంటే పిల్లలకు ఎంతో శక్తినిస్తుంది. 
 
కావాల్సిన పదార్థాలు : 
రెండు కప్పుల బియ్యం పిండి, ఒక కప్పు అన్నం, రుచికి ఉప్పు నీరు. 
 
తయారీ విధానం:
అన్నాన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. అవసరమైతే నీరు కలుపుకోవచ్చు. బియ్యంపిండిలో ఉప్పు కలిపి అన్నం పేస్టుకూడా వేసుకుని మెత్తగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా పిండి తీసుకుని పొడిపిండి అద్దుకుంటూ పల్చని చపాతీలు నొక్కుకోవాలి. పెనంపై రొట్టె వేసి పైన కొద్దిగా నీరు చిలకరించాలి. రెండు వైపులా కాల్చి, వీటిని ఏదైనా కూర లేదా పచ్చడితో నంజుకుని తింటే రుచిగా ఉంటాయి.