శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 23 మార్చి 2015 (19:09 IST)

హెల్దీ ఓట్స్ సూప్ ఎలా చేయాలో తెలుసా ?

ఓట్స్ బరువును తగ్గించడమే కాదు.. డయాబెటిస్ పేషెంట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ని నివారించడంలో ఓట్స్ ముఖ్య పాత్ర వహిస్తాయి. గుండె సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి. అలాంటి ఓట్స్‌తో హెల్దీ సూప్ ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. 
 
కావలసిన పదార్థాలు : 
ఓట్స్ - రెండు కప్పులు
ఆనియన్స్- ఒక కప్పు 
టమోటా ముక్కలు - ఒక కప్పు
కొత్తిమీర తరుగు - పావు కప్పు  
మిరియాల పొడి - అర టీ స్పూన్ 
ఉప్పు - తగినంత 
బటర్ - పావు కప్పు 
 
తయారీ విధానం : 
ఒక పెద్ద బౌల్‌లో ఆరు నుంచి 8 కప్పుల నీరు పోసి అందులో టమోటా, ఉల్లి తరుగును చేర్చి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత వాటిని ప్లేటులోకి తీసుకుని.. ఆ నీటిలోనే ఓట్స్, ఉప్పు వేసి ఉడికించాలి. పావు కప్పు టమోటా, ఉల్లి ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి.

మరో బాణలిలో నూనె పోసి వేడయ్యాక బటర్‌ను వేడి చేసుకోవాలి. అందులో ఆనియన్, టమోటా పేస్ట్‌ను చేర్చుకోవాలి. అందులో పెప్పర్ పౌడర్, ఉప్పు, ఉడికించిన కూరగాయలు, ఓట్స్‌ను చేర్చాలి. ఈ మిశ్రమాన్ని సూప్ కోసం మరిగించిన నీటిలో చేర్చాలి. రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర తరుగుతో హాట్ హాట్‌గా సర్వ్ చేయాలి.