శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2015 (16:44 IST)

సమ్మర్ స్పెషల్ : నట్స్ డ్రింక్ తాగితే ఎలా ఉంటుంది

వేసవిలో నట్స్ డ్రింక్ తాగితే ఎలా ఉంటుంది.. అదీ కూల్‌ కూల్‌గా హెల్దీ నట్స్ డ్రింక్ అంటే ఇష్టపడి తాగేస్తాం. సాధారణంగా నట్స్‌లో బరువు తగ్గించే పోషకాలున్నాయి. గుడ్ కొలెస్ట్రాల్ అందించే నట్స్‌ను వేసవిలో వెరైటీగా జ్యూస్ ద్వారా తీసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది.. ఎలా చేయాలంటే.. 
 
కావలసిన పదార్థాలు :
పాలు - ఒక లీటరు 
కుంకుమ పువ్వు - ఒక స్పూన్ 
పంచదార - ఒకటిన్నర కప్పు 
జీడిపప్పు - అర కప్పు 
పిస్తా - అర కప్పు 
బాదం - అర కప్పు
మిరియాల పొడి  - అర టీ స్పూన్ 
దాల్చిన చెక్క పొడి - అర టీ స్పూన్ 
యాలకుల  పొడి - అర టీ స్పూన్ 
 
తయారీ విధానం :
నట్స్ (బాదం, పిస్తా, జీడిపప్పు, యాలకుల పొడి, దాల్చిన చెక్క పౌడర్‌ను) బ్లెండర్‌లో గ్రైండ్ చేసుకుని ఓ బౌల్ తీసుకోవాలి. తర్వాత స్టౌ మీద పాలు పెట్టి వేడి చేసుకోవాలి. ఒక లీటర్‌ పాలు బాగా వేడియ్యాక పంచదార, కుంకుమ పప్పు చేర్చుకోవాలి. ఈ పాలను సర్వింగ్‌బౌల్‌లోకి తీసుకుని గ్రైండ్ చేసుకున్న నట్స్‌ పేస్ట్‌ను కలిపి ఫ్రిజ్‌లో ఒక గంట పాటు కూల్ కూల్‌గా సర్వ్ చేయాలి.