గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By CVR
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (13:45 IST)

నోరూరించే వంకాయ బజ్జీ

కావలసిన వస్తువులు:
వంకాయలు పెద్దవి - 4
నూనె - 6 టీ స్పూన్లు
పచ్చిమిర్చి - 10
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
నానబెట్టిన చింతపండు - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
ఆవాలు - టీస్పూను
జీలకర్ర - టీ స్పూను
మినపప్పు - టీ స్పూను
శనగపప్పు - టీ స్పూను
ఎండు మిర్చి - 10
ఉల్లి తరుగు - అర కప్పు
కరివేపాకు - రెండు రెమ్మలు
నువ్వుల పొడి - రెండు టీ స్పూన్లు
 
తయారుచేయండి ఇలా :
వంకాయలకు కొద్దిగా నూనె రాసి స్టౌ మీద పెట్టి కాల్చుకోవాలి. చల్లారిన తరువాత పైన పొట్టు తీసి, (పురుగులున్నాయేమో చూసి) మెత్తగా చేతితో మెదపాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు కలిపి మిక్సీ పట్టాలి. వంకాయ గుజ్జును మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టి తీసేయాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి కాగాక పోపు సామాను ఒకొక్కటిగా వేస్తూ దోరగా వేయించి, చల్లారాక పచ్చడిలా కలపాలి. చివరిగా ఉల్లి తరుగు, కరివేపాకు, నువ్వులపొడి వేసి కలపాలి. సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే నోరూరించే వంకా బజ్జీ రెడీ. ఇందులో నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే భలే ఉంటుంది. ట్రై చేసి చూడండి మరి.