గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 25 ఆగస్టు 2014 (16:58 IST)

వినాయక చవితి స్పెషల్: ఉండ్రాళ్ల తయారీ

వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుడిని పండ్లు, భక్ష్యాలు నైవేద్యంగా సమర్పిస్తారు. వినాయకుడికి చవితి రోజున నైవేద్యాలు సమర్పించడం పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు. 
 
అలాంటి వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైన ఉండ్రాళ్లు ఎలా చేయాలో చూద్దాం.. 
 
ఉండ్రాళ్లు ఎలా చేయాలి?
 
కావలసిన పదార్థాలు: 
బియ్యపు రవ్వ: రెండు కప్పులు 
నీళ్ళు: ఒక కప్పు
శనగపప్పు: ఒక కప్పు 
జీలకర్ర: రెండు టీ స్పూన్లు 
నూనె : నాలుగు టేబుల్ స్పూన్లు 
 
తయారీ విధానం: 
మందపాటి ప్యాన్‌ను స్టౌ మీద ఉంచి వేడయ్యాక నూనె వేసి వేడి అయిన తర్వాత జీలకర్ర వేసి వేపుకోవాలి. అందులో నీరు పోసి ఉప్పు వేసి, మరిగాక శనగపప్పు, బియ్యం రవ్వ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద ఉడికించాలి. దించే ముందు నెయ్యి వేసి కలపాలి. ఉడికిన తర్వాత కిందకు దింపి చెయ్యి తడిచేసుకుంటూ ఉండలు కట్టాలి. ఉండలు ఉడికిన తర్వాత దించేసి.. స్వామికి నైవేద్యంగా సమర్పించవచ్చు.