శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వినాయక చవితి
Written By Selvi
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2016 (15:24 IST)

గణపతి పూజకు వేళాయె.. ఇకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఇలా చేయండి.. 12 స్టెప్పులివిగోండి.. (ఫోటోలు)

గణపతి పూజకు వేళాయె. విఘ్నేశ్వర జయంతి వచ్చేస్తోంది. లడ్డూలు, మోదకాలంటే బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టం. గణేష చతుర్థికి బొజ్జ గణపయ్యకు పెట్టే నైవేద్యాల గురించే ఎక్కువ ఆలోచించకుండా.. గణనాథుడి బొమ్మను గురించి క

గణపతి పూజకు వేళాయె. విఘ్నేశ్వర జయంతి వచ్చేస్తోంది. లడ్డూలు, మోదకాలంటే బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టం. గణేష చతుర్థికి బొజ్జ గణపయ్యకు పెట్టే నైవేద్యాల గురించే ఎక్కువ ఆలోచించకుండా.. గణనాథుడి బొమ్మను గురించి కూడా కాస్త ఆలోచించాలి అంటున్నారు పర్యావరణ పరిరక్షణ అధికారులు. ఇకో ఫ్రెండ్లీ గణనాథ బొమ్మల్ని ఎంచుకోవడం ద్వారా నీటి కాలుష్యాన్ని నిరోధించవచ్చునని వారు సలహా ఇస్తున్నారు. 
 
ఇందుకోసం రసాయనాలతో తయారైన విఘ్నేశ్వర ప్రతిమలను పక్కన బెట్టి ఇంట్లో వినాయకుడి బొమ్మను తయారు చేసుకోండి అంటూ సలహా ఇస్తున్నారు. ఇంట్లో లభించే పసుపు, మైదా, గోధుమలతో వినాయకుడిని ప్రతిమను తయారు చేసుకుని విఘ్నేశ్వర పూజ చేస్తే.. వినాయకుడిని సముద్రంలో నిమజ్జనం చేసేటప్పుడు జలచరాలను బతికించిన వారవుతామని పర్యావరణ పరిరక్షణ అధికారులు తెలిపారు. 
 
రసాయనాలు కలపని మట్టి బొమ్మలైతే పూజకు సరి. కానీ రసాయనాలు, ప్లాస్టిక్ కలిపిన వినాయక బొమ్మను పూజించినా ఫలితం ఉండదు. వినాయక చవితి రాగానే పెద్ద పెద్ద బొమ్మలకు ప్రాధాన్యం ఇచ్చే మీడియా కూడా ఎకో ఫ్రెండ్లీ గణేష్‌లను ప్రోత్సహిస్తే తప్పకుండా నీటి కాలుష్యాన్ని చాలామటుకు దూరం చేసుకోవచ్చు. ఫలాలు, పత్రాలు, పుస్తకాలు, పుష్పాలు, మోదకాలు, లడ్డూలతో పాటు ఇకో ఫ్రెండ్లీ బొమ్మతో గణనాథుని సేవించడం మంచిది. అలాంటి ఇకో ఫ్రెండ్లీ గణనాథుని బొమ్మను ఇంట్లోనే తయారు చేయాలంటే..? అర కేజీ గోధుమ పిండి మాత్రం చాలు. 

ఎలాగంటారా? ఇదిగోండి.. ఇకో ఫ్రెండ్లీ గణనాథుని తయారీకి 12 స్టెప్పులు.. 
1. గోధుమ పిండిని చపాతీలకు తగినట్టు మెత్తగా సిద్ధం చేసుకోండి..
 ముద్దలుగా వేర్వేరు చేసుకోండి 2. గోధుమ పిండి మూ2. గోధుమ పిండి మూడు ముద్దరు చేసుకోండి డు ముద్దలుగా  గోధుమ పిండి మూడు ముద్దలుగా వేర్వేరు చేసుకోండి సుకోండి 
2. గోధుమ పిండి మూడు ముద్దలుగా వేర్వేరు చేసుకోండి 
 

















 

2. గోధుమ పిండి మూడు ముద్దలుగా వేర్వేరు చేసుకోండి 




















3. పూరీల్లా వత్తుగా రుద్దుకోండి






















4. పిండిని వినాయకుని తొండంలా వత్తుకోండి 




















5. తొండంలా వత్తుకున్న పిండిని రెండు కాళ్ళులా చేసుకుని చిత్రంలో ఉన్నట్లు సిద్ధం చేసుకోండి. ముందు పూరీలా వత్తుకున్న పిండి.. ఆపై రెండు కాళ్లు, ఆ పై బొజ్జలా పిండిని ఉంచండి. 





















6. బొజ్జకు పై రెండు చేతులు అమర్చండి.


7. గణపయ్య బొట్ట ఫై భాగంలో రెండు చేతులు అమర్చుకోండి.




















8. గణనాథుని తలను పోలిన పిండి ముద్దను అమర్చండి. 





















9. తలకు కాస్త కింద తొండాన్ని అమర్చండి.


10. ఆపై అదే పిండితో చెవుల్ని అమర్చుకోండి 





















11. చివర్లో గణపయ్య నెత్తిన కిరీటం పెట్టేయండి 






















12. గణపయ్యకు దంతం అమర్చితే ఇకో ఫ్రెండ్లీ వినాయకుడు సిద్ధమైనట్లే.





















ఈ గోధుమ పిండి ఇకో ఫ్రెండ్లీ గణపయ్యకు ఇంట్లో లభ్యమయ్యే పసుపు, చందనం, కుంకుమతో నేత్రాలను దిద్దుకుని, పుష్పాలతో, బొట్టుతో మీకు నచ్చినట్లు అమర్చుకోండి. అంతే వినాయక చవితి ఇకో ఫ్రెండ్లీ గణపతి రెడీ అయినట్లే. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ళల్లో పర్యావరణానికి హాని కలిగించని గణపతిని తయారు చేసుకోండి.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..