వినాయకుడిని మెట్లకింద వుంచి పూజ చేయొచ్చా?

సోమవారం, 14 ఆగస్టు 2017 (16:14 IST)

వినాయక చతుర్థి పండుగ రోజున విఘ్నేశ్వరుడి అనుగ్రహం కోసం పత్రాలు, పుష్పాలు, మోదకాలు వంటివి సమర్పిస్తుంటాం. అయితే విఘ్నేశ్వరుడిని ఏ దిశలో వుంచి పూజించాలో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవండి. వినాయక చవితి రోజున వినాయక ప్రతిమను పూజ గదిలో వుంచి పూజ చేస్తుంటాం. అయితే వాస్తు ప్రకారం వినాయకుడి తొండం ఎప్పుడూ ఎడమవైపు చూసేలా వుంచాలి. బొజ్జయ్య తల్లి పార్వతీ దేవిని ఆ తొండం చూసేలా వుండాలి. 
 
వినాయకుడిని ప్రతిమ వెనుక భాగం.. ఏ గదిని చూసేలా వుంచకూడదు. ఇది చీకటిని సూచిస్తుంది. కాబట్టి.. గణపయ్య వీపుభాగం వాకిలిని చూసేట్లు వుంచాలి. ఇంట్లోని దక్షిణ దిశలో వినాయకుడిని వుంచి పూజించకూడదు. తూర్పు, పడమర వైపున వుంచి పూజ చేయొచ్చు. ఇంకా బాత్రూమ్‌ను కనెక్ట్ అయిన గోడను ఆన్చి వినాయకుడిని వుంచకూడదు. 
 
అంతేగాకుండా.. గోడకు ఆన్చి వినాయకుని ప్రతిమను ఉంచకూడదు. లోహంలో చేసిన విఘ్నేశ్వరుడిని తూర్పు, పడమర దిశలో వుంచి పూజించాలి. ఇంకా ఈశాన్య దిశలో వినాయకుడిని వుండి పూజించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. అలాగే మెట్ల కింద వినాయకుడిని వుంచి పూజించడం చేయకూడదు. అలా చేస్తే.. మెట్లు ఎక్కేటప్పుడు విఘ్నేశ్వరుడిని తలపై నడుస్తున్నట్లు అవుతుంది. ఇది దురదృష్టానికి కారణమవుతుంది.దీనిపై మరింత చదవండి :  
Ganapathy Worhip Direction Northeast Steps Vinayaka Chaturthi Ganesh Chaturthi

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

కృష్ణాష్టమి రోజున పసుపు రంగు దుస్తులు ధరించండి..

కృష్ణాష్టమి నాడు భక్తుడు శ్రీకృష్ణుడిని నిష్ఠతో పూజించేవారికి సకల సంపదలు చేకూరుతాయి. ...

news

రద్దీ బాబోయ్.. రద్దీ... తిరుమల క్యూ లైన్లకు తాళాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ ...

news

గన్నేరు, గరికతో వినాయకుడిని పూజిస్తే? గరికను బీరువాలో ఉంచితే?

ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభిస్తే తొలుత విఘ్నేశ్వరుడిని స్తుతించడం ఆనవాయితీ. సమస్త ...

news

ధర్మరాజు మనువడనే విషయాన్ని మరిచిన పరీక్షిత్తు.. ఎలా మరణించాడంటే?

ధర్మరాజు మనుమడు అనే విషయాన్ని పరీక్షిత్తు మహారాజు మరిచిపోయి.. చెయ్యరాని పని చేయడం ద్వారా ...