Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వినాయక చవితి... వినాయకుని ఆలయానికి వెళ్ళేవారు ఏం చేయాలి....?

శనివారం, 3 సెప్టెంబరు 2016 (19:08 IST)

Widgets Magazine

వినాయక చవితి దగ్గరపడుతోంది. ఈ నెల 5వ తేదీ వినాయకచవితి వేడుకలు జరుగనున్నాయి. అసలు వినాయకుని ఆలయానికి వెళితే ఏం చేయాలో చాలామంది భక్తులకు తెలియదు. వినాయకుని ఆలయానికి వెళితే ఏం చేయాలో తెలుసుకుందాం..
ganesh
 
వినాయకునికి ఆలయానికి వెళ్లేవారు ముందుగా ఆయన ముందు ప్రణమిల్లి 13 ఆత్మప్రదక్షిణాలు చేయాలి. కనీసం మూడు గుంజీలు తీయాలి. వినాయకుడికి 21 వెదురు పుష్పాలు కాని, కొబ్బరి పువ్వులను కానీ, వెలగ పుష్పాలను కానీ అలంకరణ కోసం సమర్పించాలి.
 
ఇవి దొరకని పక్షంలో 21 గరిక గుచ్ఛాలను సమర్పించాలి. నైవేథ్యంగా చెరకు, వెలగకాయ, కొబ్బరిబోండాలను సమర్పించుకోవాలి. గణేశుని ఆలయం ప్రత్యేకంగా ఉంటే ఐదు ప్రదక్షిణాలు చేయాలి. గణేశునకు అభిషేకం అంటే ఎంతో ఇష్టం. అయితే జలంతో కన్నా కొబ్బరినీళ్ళు, చెరకురసంతో అభిషేకం చేసినట్లయితే వ్యాపారాభివృద్ధి, వంశాభివృద్ధి, గృహ నిర్మాణాలు చేపట్టడం వంటి సత్ఫలితాలు ఉంటాయి. 
 
జిల్లేడు లేదా తెల్ల జిల్లేడు పువ్వులతో గణేశుని పూజించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తెల్లజిల్లేడు వేరుతో అరగదీసిన గంధాన్ని వినాయకుడికి అర్చించినట్లయితే అత్యంత శీఘ్రంగా కోరిన కోరికలు నెరవేరుతుంది. 
 
ఇంకా చవితి హస్తా నక్షత్రం కలిసి వచ్చినపుడు వినాయకుడిని పూజిస్తే సుఖసంతోషాలు చేకూరుతాయి. హస్తా నక్షత్రం రోజున చవితిరోజున విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, విద్యకు సంబంధించిన వస్తువులు దానం చేయడం ఉత్తమం అని పురోహితులు చెబుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

గణపయ్య జననం గురించి మీకు తెలుసా? విష్ణువు గంగిరెద్దుగా ఎందుకు మారాడు?

సూతమహర్షి శౌనకాది మునులకు ఆది దేవుడైన గణపయ్య పుట్టుక గురించి ఇలా చెప్పుకొచ్చారు. ...

news

శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి చదవండి.. విఘ్నాలను తొలగించుకోండి

వినాయక చవితి రోజున శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళిఃలోని నామాలు చదువుతూ.. స్వామిని పూలతో ...

news

వినాయక చవితి.. పూజలో ఉండ్రాళ్ళు తప్పకుండా ఉండేలా చూసుకోండి.

వినాయకచవితి రోజున విఘ్నేశ్వరుని పూజకు కావలసిన సామగ్రిని సమకూర్చుకోవాలి. పసుపు, కుంకుమ, ...

news

ఖైరతాబాద్ మహాగణేశునికి భారీ ల‌డ్డూ... బెజ‌వాడ‌లో త‌యారు...

విజ‌య‌వాడ ‌: తెలంగాణాలో ప్ర‌త్యేక‌మైన ఖైర‌తాబాద్ గ‌ణేష్ ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. ...

Widgets Magazine