శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వినాయక చవితి
Written By chj
Last Modified: గురువారం, 1 సెప్టెంబరు 2016 (18:54 IST)

ఇలాంటి వినాయకుడినే పూజించాలి... వినాయక చవితి స్పెషల్...

వినాయకునికి తొండము ముఖ్యము. కుడి వైపుకు తిరిగి ఉన్న తొండము ఉన్న గణపతిని ‘లక్ష్మీ గణపతి’ అంటారు. తొండము లోపలి వైపుకు ఉన్న గణపతిని ‘తపో గణపతి’ అని అంటారు. తొండము ముందుకు ఉన్న గణపతికి పూజలు చేయరాదు. గణపతికి ఒక దంతము విరిగి ఉంటుంది. విరిగి ఉన్న ఆ దంతము చ

వినాయకునికి తొండము ముఖ్యము. కుడి వైపుకు తిరిగి ఉన్న తొండము ఉన్న గణపతిని ‘లక్ష్మీ గణపతి’ అంటారు. తొండము లోపలి వైపుకు ఉన్న గణపతిని ‘తపో గణపతి’ అని అంటారు. తొండము ముందుకు ఉన్న గణపతికి పూజలు చేయరాదు. గణపతికి ఒక దంతము విరిగి ఉంటుంది. విరిగి ఉన్న ఆ దంతము చేతితో పట్టుకొని ఉన్న గణపతిని వృద్ధ గణపతి అంటాము. ఈ గణపతికి పూజలు చేయరాదు. 
 
గణపతికి వాహనము ఎలుక. కావున మనము పూజించే ప్రతిమలో గణపతి విడిగా, ఎలుక విడిగా ఉండకూడదు. గణపతి ప్రతిమలోనే ఎలుక అంతర్భాగముగా ఉండాలి. గణపతికి యజ్ఞోపవీతము ఉండవలెను. పామును యగ్నోపవీతముగా ధరించి ఉన్న గణపతిని పూజించవలెను. గణపతి ముఖములో చిరునవ్వు ఉండాలి. మనము పూజించే గణపతి ప్రతిమ చిరునవ్వు ఉన్న గణపతిగా ఉండాలి. 
 
అందుకే మనం "ప్రసన్న వదనం ధ్యాయేత్" అని ఆయనను పూజిస్తాము. గణపతిని రెండవ రోజు(పూజ పక్కరోజు) కదిలించి తీయవచ్చు. ఒకవేళ పక్క రోజు శుక్రవారం లేదా మంగళవారం అయితే అటుపక్క రోజు(3వ రోజు) కదిలించి తీయవచ్చు. గణపతికి చతుర్భుజాలు ఉండాలి. ఒక చేతిలో లడ్డు, మరో చేతిలో కమలము, మరో చేతిలో శంఖము, మరో చేతిలో ఏదైనా ఆయుధము ఉండాలి.