ఈ దెబ్బ ఖైరతాబాద్ లడ్డు కాదు... విజయవాడ లడ్డూయే పెద్దది.. 6300 కేజీలు

lord Ganesha
ivr| Last Modified బుధవారం, 16 సెప్టెంబరు 2015 (16:21 IST)
వినాయక చవితి లడ్డూ అంటే ప్రతి ఏటా ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి లడ్డు గురించే చెప్పుకుంటారు. కానీ రాష్ట్రం విడిపోయాక పరిస్థితుల్లోనూ మార్పులు వచ్చాయి. ఇప్పుడు గణపతి లడ్డూ బరువు, సైజుల్లోనూ పోటీ పెరిగిపోయింది. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి చేతిలో ఉండే లడ్డూ బరువు 6000 కేజీలతో తయారు చేస్తుంటే విజయవాడ వినాయకుని చేతిలో ఉండే లడ్డూను 6300 కేజీలతో చేస్తున్నారు. 
 
ఖైరతాబాద్ వినాయకుడి లడ్డూ, విజయవాడ లడ్డూ రెండింటినీ తాపేశ్వరంలోనే తయారుచేస్తున్నారు. ఖైరతాబాద్ లడ్డును సురుచి ఫుడ్స్ తయారు చేస్తుంటే, విజయవాడ లడ్డును భక్తాంజనేయ స్వీట్స్ తయారుచేస్తున్నారు. మొత్తానికి గణేషుడి లడ్డూల సైజుల్లో పోటీ పెరిగిందన్నమాట.దీనిపై మరింత చదవండి :