గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వినాయక చవితి
Written By Selvi
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (18:41 IST)

విఘ్నేశ్వరుడికి చింతామణి అనే పేరు ఎలా వచ్చింది?

విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి చింతామణి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? అయితే ఈ కథనం చదవండి ఒకానొకప్పుడు గణ్ అనే క్రూర రాజు ఉండేవాడు. అతను పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం, ధ్యానం చేసే సాధువులకు కష్టాలు పెట్టేవాడట. 
 
ఒకసారి, అతను తన స్నేహితులతో కలిసి వేటకు అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో కపిల అనే సాధువు కుటీరం ఉంది. ఆ సాధువు గణ్‌ని అతని స్నేహితులను భోజనానికి పిలిచాడు. గణ్ కపిల సాధువు కుటీరం చూసి నవ్వుతూ ఇలా అన్నాడు.
 
“నువ్వు ఇంత పేద సాదువువి ఇంతమందికి భోజనం ఏర్పాటు చేస్తావా?” అని. వెంటనే, ఆ సాధువు ‘చింతామణి’ (కోరికలను తీర్చే రాయి)ని అతని గొలుసు నుండి తీసి, దానిని ఒక చిన్న చెక్క బల్లపై ఉంచాడు. అతను దానిని అభ్యర్థిస్తూ, ప్రార్థన చేయగానే అక్కడ ఒక వంటిల్లు ఏర్పడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 
 
ప్రతి ఒక్కరూ కూర్చోవడానికి చందనపు ఆసనాలు ఏర్పడ్డాయి, వెండి పళ్ళాలలో ప్రతి ఒక్కరికీ వివిధ రకాల రుచికరమైన భోజనం వడ్డించబడింది. గణ్ అతని స్నేహితులు ఈ రుచికరమైన ఆహారాన్ని సంతోషంగా ఆరగించారు.
 
గణపతిని చింతామణిగా ఎందుకు పిలుస్తారు?
 
భోజనం చేసిన తరువాత, గణ్ ఆ కపిల సాధువుని ఆ అద్భుతమైన రాయి ఇమ్మని అడిగాడు, కానీ సాధువు నిరాకరించాడు, అలాగే అతను గణ్ యొక్క క్రూర స్వభావాన్ని తెలుసుకున్నాడు, అందువల్ల, గణ్ సాధువు చేతులో నుండి ఆ రాయిని లాక్కున్నాడు.
 
ఆ తరువాత, కపిల సాధువు గణపతిని ప్రార్ధించాడు. ఆ సాధువు భక్తికి మెచ్చి గణపతి గణ్‌ను శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. గణ్ ఆ రాయిని వెనక్కు తీసుకోవడానికి కపిల్ సాధువు అతనితో పోరాడడని అనుకుని, ముందే కపిల సాధువుపై ఆక్రమణ చేసాడు. గణపతి దయవల్ల, ఆ అడవిలో ఒక పెద్ద సైన్యం తయారయి, గణ్ సైనికులను దాదాపు నాశనం చేసింది. వెంటనే గణపతి స్వయంగా యుద్ధానికి ప్రవేశించాడు. గణ్, గణపతిపై బాణాల ప్రవాహాన్ని సంధించాడు.
 
కానీ గణపతి ఆ బాణాలను గాలిలోనే నాశనం చేసాడు. వెంటనే గణపతి తన ఆయుధంతో గణ్‌పై సంధించి అతనిని చంపాడు. గణ్ తండ్రి అభిజీత్ రాజు, యుద్ధభూమికి వచ్చి గణపతి ముందు తలాడించాడు. 
 
అతను ‘చింతామణి’ని కపిల సాధువుకి ఇచ్చి, అతని తప్పులను క్షమించి మరణానంతరం మోక్షాన్ని ఇవ్వమని కోరాడు. గణపతి దేవుడు అతని ప్రార్థనను మన్నించాడు. గణపతి సహాయంతో కపిల సాధువు తన చింతామణిని పొందడం వల్ల గణపతికి ‘చింతామణి’ అనే పేరు వచ్చింది. 
 
అందుచేత వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుడిని నిష్టతో పూజించేవారికి సకల సంపదలు చేకూరుతాయని, కార్యసిద్ధి అవుతుందని పండితులు అంటున్నారు.