వక్షోజాలు పెద్దవి కావాలంటే ఏం చేయాలి?

PNR|
File
FILE
సాధారణంగా అనేక మంది అమ్మయిలకు వక్షోజాలు చాలా చిన్నవిగా ఉంటాయి. మరికొందరు యువతుల్లో పరిమాణానికి మించి ఉంటాయి. నడుం చిన్నదిగా ఉన్నప్పటికీ.. పాలిండ్ల సైజులు మాత్రం ఇట్టే ఆకర్షించేలా కనిపిస్తుంటాయి. మరికొందరికైతే... శరీరం ఊబకాయాన్ని తలిపిస్తున్నా... వక్షోజాల సైజులు మాత్రం చాలా చిన్నవిగా ఉంటాయి.

ఇలాంటి యువతులు తమ సమస్యను బయటకు చెప్పుకోలేక మనస్సులోనే మథన పడుతుంటారు. మిగిలిన వారిలా పెద్దవిగా కనిపించేందుకు పలువురు వైద్యులను సంప్రదించడమే కాకుండా, తమకు తోచిన పద్దతులను కూడా అనుసరిస్తుంటారు.

ఈ విషయాన్ని కొందరు వైద్యుల ప్రస్తావిస్తే.. వక్షోజాల విషయంలో యువతులు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదంటున్నారు. కొంతమందిలో చిన్నవిగాను మరికొంత మందిలో పెద్దవిగాను ఉండడం సహజం. దానికి దిగులు పడాల్సిన అవసరం లేదంటున్నారు. అవసరమైన మంచి ఆహారం తీసుకోవడం వల్ల వీటి సైజులను పెంచుకోవచ్చని చెపుతున్నారు.

అంతేకాకుండా, వక్షోజాలు పెరగడానికి సర్జరీకి ఆసక్తి చూపడం సరైన పద్దతి కాదని హితవు పలుకుతున్నారు. దీనివల్ల ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు అధికంగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. మంచి పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు.. చిన్నచిన్న వ్యాయామాలు చేయడం ద్వారా వక్షోజాల సైజును కొంత పరిమాణంలోనైనా పెంచుకోవచ్చని చెపుతున్నారు.

అలాగే, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని రకాల బ్రాలు కూడా వక్షోజాల సైజును పెద్దవిగా చూపించగలుగుతున్నాయని, వీటిని ధరించడం వల్ల నలుగురిలో మీ సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభిస్తుందని చెపుతున్నారు.


దీనిపై మరింత చదవండి :