గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 నవంబరు 2015 (18:32 IST)

మహిళల్లో నిద్ర తక్కువైతే ఏం జరుగుతుందో తెలుసా?

మహిళల్లో ప్రస్తుతం నిద్రలేమితో ఉత్పన్నమయ్యే అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రసవం అయినవారు వారంలో రెండు, మూడు రోజులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వర్కింగ్‌డేస్‌‌లో ఏడుగంటల ఇరవై నిమిషాలపాటు, సెలవు దినాలలో ఎనిమిది గంటల ఇరవైనిమిషాలసేపు నిద్రపోతున్నారు.

పని ఒత్తిడి, లైఫ్‌స్టైల్‌, డిప్రెషన్‌ నిద్రపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. నిద్ర సరిపోని వారు తిండి, పని వంటి విషయాలపై ఆసక్తిని కోల్పోతున్నారని తాజా అధ్యయనాల్లో తేలింది. అలాంటి వారు మీరైతే హాయిగా నిద్రపోవడానికి ఈ టిప్స్ పాటించండి. 
 
* ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకే సమయంలో పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.
* నిద్రకు ఉపక్రమించడానికి మూడు గంటల ముందు వ్యాయామం చేస్తే మంచి నిద్రపడుతుంది.
* పడుకొనే ముందు కాఫీ, ఆల్కహాల్‌ సేవించడం వంటివి చేయకూడదు.
 
* పడకగదిలో ఆరోమా క్యాండిల్స్‌ను వెలిగించుకోండి. మంచి సువాసన వస్తుంది. మంచి నిద్ర పడుతుంది. 
* మీకిష్టమైన మ్యూజిక్‌ను వినండి. తక్కువ సౌండ్‌తో సంగీతం వింటే ఇట్టే నిద్రలోకి జారుకునేలా చేస్తుంది.
* రాత్రిపూట తీసుకునే ఆహారం నిద్రకు రెండు గంటల ముందే తీసుకోవడం మంచిది. 
* రాత్రిపూట 8 గంటలు నిద్రపోతే ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు.